సౌత్ నెంబర్ వన్ హీరో ప్రభాస్.. ఇదిగో ప్రూఫ్!

By Prashanth MFirst Published Nov 21, 2018, 8:03 PM IST
Highlights

బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ రెస్పాన్స్ అందుకున్నాడు. 

బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ రెస్పాన్స్ అందుకున్నాడు. ఇక నార్త్ జనాలకు కూడా చాలావరకు ఫెవరెట్ హీరోగా మారాడు ప్రభాస్.

ఇక సౌత్ లో నెంబర్ వన్ హీరో అని సోషల్ మీడియా ద్వారా తేలిపోయింది.   ఈ హీరో సోషల్ మీడియాలో కనిపించేది చాలా తక్కువ. కేవలం ఫెస్ బుక్ మాత్రమే ఉంది. దీంతో చాలా వరకు ప్రభాస్ ను ఇష్టపడే వారు ఫెస్ బుక్ లో ఫాలో అవుతున్నారు. అయితే రీసెంట్ గా ప్రభాస్ ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్ ను క్రాస్ చేసింది. 

సౌత్ లో ఏ హీరోకు కోటి మంది ఫాలోవర్స్ లేరు. అల్లు అర్జున్ - మహేష్ బాబు వంటి వారు ఇతర ఇండస్ట్రీల అభిమానులను ఆకర్షించినప్పటికీ ఆ స్థాయిలో మార్క్ ను అందుకోలేకపోయారు. దీంతో ప్రభాస్ అభిమానులు వారి ఫెవరెట్ హీరో నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో ఈ విషయాన్నీ షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం రెబల్ స్టార్ సాహో సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  

click me!