షాకింగ్ న్యూస్... ‘మహానటి’ లో కాజల్

Published : May 07, 2018, 11:47 AM ISTUpdated : May 07, 2018, 11:49 AM IST
షాకింగ్ న్యూస్... ‘మహానటి’ లో కాజల్

సారాంశం

ఎవరి పాత్రలోనే తెలుసా..?

మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన `మ‌హాన‌టి` సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తెలుగు వారికి ఎంతో ఇష్ట‌మైన సావిత్రి నిజ‌జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్క‌డం, సినిమాలో వివిధ భాష‌ల‌కు చెందిన ప్ర‌ముఖ న‌టులు న‌టిస్తుండ‌డం `మ‌హాన‌టి`పై  అంచనాలు పెరగడానికి మరో కారణం.  నాగ అన్వేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తీ సురేష్ లీడ్ రోల్ లో నటిస్తోంది.   స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మోహ‌న్‌బాబు, సింగీతం శ్రీనివాస‌రావు, డైరెక్ట‌ర్ క్రిష్‌, ప్ర‌కాష్‌రాజ్ వంటి ప్ర‌ముఖ న‌టులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


 
తాజాగా ఈ సినిమాలో మ‌రో టాప్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా న‌టిస్తోందంటూ షాకింగ్ న్యూస్ బ‌య‌టికొచ్చింది. ఈ విష‌యాన్ని `మ‌హాన‌టి` చిత్ర నిర్మాణ సంస్థ వెల్ల‌డించింది. కాజ‌ల్ ఫోటోను కూడా త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ``మ‌హాన‌టి`లో కాజ‌ల్ ఏమి చేస్తోందో తెలుసుకోవాల‌నుకుంటున్నారా? అయితే మే తొమ్మిదో తేదీ వ‌ర‌కు ఆగండి` అంటూ కామెంట్ కూడా పెట్టింది. మరి అందాల చందమామ నిజంగానే మహానటిలో నటిస్తుందా..? ఒకవేళ నటిస్తే.. ఎవరి పాత్రకు కాజల్ ఎంపిక చేశారు..? అనే సందేహాలు ఇప్పటికే అభిమానుల్లో మొదలయ్యాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే.. మే9వ తేదీ వరకు ఆగాల్సిందే.

PREV
click me!

Recommended Stories

ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది
Illu Illalu Pillalu Today Episode Dec 23: అమూల్యను విశ్వ ట్రాప్ చేశాడని తెలుసుకున్న ధీరజ్, ఇంగ్లిష్ టీచర్ వల్లి