పరిశ్రమలో విషాదం... గుండెపోటుతో నటి అకాలమరణం

Published : Aug 21, 2021, 05:06 PM IST
పరిశ్రమలో విషాదం... గుండెపోటుతో నటి అకాలమరణం

సారాంశం

భర్త విజయ రాఘవన్, కూతురు మహాలక్ష్మితో కలిసి  చిత్ర చెన్నై సాలిగ్రామంలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం నెల్లనై చిత్ర కొన్ని తమిళ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. చిత్ర మరణవార్త తెలుసుకున్న ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

చిత్ర పరిశ్రమలో వరుస వివాదాలు కలవర పెడుతున్నాయి. గత ఏడాదిన్నర కాలంలో అనేక మంది నటులు, సాంకేతిక నిపుణలు వివిధ కారణాలతో తుదిశ్వాస విడిచారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి పరిశ్రమకు చెందిన ప్రముఖులను పొట్టనబెట్టుకుంది. తాజాగా నటి నెల్లనై చిత్ర హఠాన్మరణం పొందారు. 56ఏళ్ల చిత్ర గుండెపోటుకు గురికావడంతో మరణించినట్లు తెలుస్తుంది. 

భర్త విజయ రాఘవన్, కూతురు మహాలక్ష్మితో కలిసి  చిత్ర చెన్నై సాలిగ్రామంలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం నెల్లనై చిత్ర కొన్ని తమిళ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. చిత్ర మరణవార్త తెలుసుకున్న ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. 

అప్పట్లో బాగా వైరల్ అయిన నెల్లనై అనే కమర్షియల్ లో నటించిన చిత్ర, నెల్లనై చిత్ర అయ్యారు.  సౌత్ లో వందకు పైగా చిత్రాలలో కీలక రోల్స్ చేశారు. మలయాళంలో మోహన్ లాల్, ప్రేమ్ నజీర్ వంటి నటులతో ఆమె స్క్రీన్ స్పేస్ పంచుకున్నారు. తెలుగులో కూడా చిత్ర కొన్ని చిత్రాలలో నటించినట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?