చిరు నెక్ట్స్ మూడు ప్రాజెక్టుల టైటిల్స్ ఇవే

Surya Prakash   | Asianet News
Published : Aug 21, 2021, 03:55 PM IST
చిరు నెక్ట్స్ మూడు ప్రాజెక్టుల టైటిల్స్ ఇవే

సారాంశం

రేపు ఉదయం తొమ్మిది గంటలకు మెగా ప్రభంజనం చూస్తారని నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది.దీంతో ఆ అప్డేట్ ఏంటా?   


తమిళంలో సక్సెస్ అయ్యిన ‘వేదాలం’ తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్‌ కాబోతున్న సంగతి తెలిసిందే. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ‘ఆచార్య’ పూర్తి కాగానే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంకోసం ఆయన గుండుతో కనిపించ బోతున్నాయి.  ఈ చిత్రానికి సంబందించిన అప్డేట్ రాబోతోందని చిత్రయూనిట్ తాజాగా ప్రకటించింది. రేపు ఉదయం తొమ్మిది గంటలకు మెగా ప్రభంజనం చూస్తారని నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది.దీంతో ఆ అప్డేట్ ఏంటా? అని మెగా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సినిమా టైటిల్ ప్రకటిస్తారా? అంచనా వేస్తున్నారు. అయితే ఆ టైటిల్ ఇప్పటికే ఖరారు చేసారని వినికిడి. ఇంతకీ ఆ టైటిల్ ఏంటి?

అందుతున్న సమాచారం మేరకు మెహర్ రమేష్ డైరెక్షన్లో చేయబోతున్న ‘వేదాళం’ రీమేక్ కు ‘భోళా శంకర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే బాబీ డైరెక్షన్లో చేయబోతున్న సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ను అనుకుంటున్నారట. ‘లూసిఫర్’ రీమేక్ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ కథలో హీరో చెల్లెలి పాత్ర కీలకం. ఆ పాత్ర కోసం సాయిపల్లవితోపాటు పలువురు హీరోయిన్స్ ని పరిశీలించారు. సాయిపల్లవి, కీర్తిసురేష్‌ల్లో ఎవరో ఒకరిని ఎంపిక చేయాలని చిత్ర టీమ్ ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఎట్టకేలకు ఆ పాత్రలో నటించేందుకు కీర్తి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.  కీర్తి సురేష్‌ ‘రంగ్‌దే’లో నటిచింది. ఆ తర్వాత మహేష్‌బాబుతో ‘సర్కార్‌ వారి పాట’లోనూ ఆడిపాడుతోంది. ఆమె నటించిన ‘మిస్‌ ఇండియా’, ‘గుడ్‌లక్‌ సఖి’ త్వరలోనే విడుదల కాబోతున్నాయి. 
  
ఈ చిత్రంలో చిరు కొన్ని సన్నివేశాల్లో గుండుతో కనిపించే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం ఇదివరకే మేకప్‌ టెస్ట్‌ కూడా చేశారు. అలాగే చిరంజీవి ఏ స్టార్ హీరోకి సాధ్యంకాని విధంగా ఏకంగా మూడు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకువెళ్లబోతున్నారు. ఈ ఆగష్ట్ 22న ఆయన 66వ పుట్టిన రోజు జరుపుకోబోతున్న సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఆచార్య’ తో పాటు మరో సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను ఇవ్వబోతున్నారు. ‘ఆచార్య’ నుండీ విడుదల తేదీతో కూడిన ఒక కొత్త  పోస్టర్ ను రిలీజ్ చేస్తారు. ఆ మూవీకి సంబంధించి రెండు పాటల షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
 

PREV
click me!

Recommended Stories

Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్