#Maheshbabu మహేశ్‌బాబుతో రాజమౌళి మూవీ.,అంత బడ్జెట్టా? షాకింగ్

By Surya PrakashFirst Published Jan 2, 2024, 9:02 AM IST
Highlights

మొత్తం షూటింగ్  మూడు దేశాల్లో జరగనుంది. ఈ సినిమా షూటింగ్‌లో కొంత భాగం దట్టమైన అమెజాన్ అడవుల్లో జరగనుంది. 


రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో ఎప్పుడో సినిమా రావాల్సి ఉన్నా...  ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి భారీ ప్రాజెక్టుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు రూట్‌ క్లియర్‌ అయింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను రాజమౌళి మొదలుపెట్టారు. ఈ నెలలో మహేశ్‌బాబు కూడా త్రివిక్రమ్‌ సినిమా గుంటూరు కారం ను పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేసారు.అతి త్వరలోనే... రాజమౌళి ప్రపంచంలోకి అడుగుపెడతారు మహేష్. ఈ కాంబినేషన్‌లో వస్తున్న మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బడ్జెట్ ఎంత ఉండవచ్చు..అనే లెక్కలు ట్రేడ్ లో మొదలయ్యాయి. 

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం కోసం 1500 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఓ తెలుగు హీరో నటించే సినిమాకు అంత పెట్టడం అంటే మామూలు విషయం కాదు. నిజమే అయితే పెద్ద రికార్డే. ప్రస్తుతం రాజమౌళి లొకేషన్‌ల వేటలో ఉన్నారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ యాక్షన్ చిత్రం   షూట్ ఏప్రిల్ 2024లో ప్రారంభమవుతుంది. షూటింగ్‌కు ముందు రాజమౌళి ఒక ప్రత్యేక వర్క్‌షాప్‌ని ప్లాన్ చేసారు. మహేష్ బాబుతో పాటు మొత్తం టీమ్ కూడా హాజరుకానున్నారు. 
 
టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న రాజమౌళి దీనిని గురించి మాట్లాడుతూ... ‘ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ’ అంటూ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా ఇది ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని పాన్‌ వరల్డ్  స్థాయిలో నిర్మించనున్నారు.  హై-వోల్టేజ్ యాక్షన్‌ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా మూడు భాగాలుగా రానుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

Latest Videos

మొత్తం షూటింగ్  ప్రపంచంలోని మూడు దేశాల్లో జరగనుంది. ఈ సినిమా షూటింగ్‌లో కొంత భాగం దట్టమైన అమెజాన్ అడవుల్లో జరగనుంది. షూటింగ్  ప్రారంభానికి ముందు రాజమౌళి మీడియాతో ఇంటరాక్ట్ అవుతారు. ప్రముఖ హాలీవుడ్ స్టూడియో,  కెఎల్ నారాయణతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. హీరోయిన్ , ఇతర నటీనటులను త్వరలోనే ఖరారు చేస్తారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ని త్వరలో ఖరారు చేయనున్నారు.
 
మహేశ్‌బాబు మాట్లాడుతూ...‘ఆయనతో పనిచేయాలన్న కల సాకారం కాబోతోంది. రాజమౌళితో ఒక సినిమా చేస్తే, 25 సినిమాలు చేసినట్టే. ఈ ప్రాజెక్టు విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నా. ఇది పాన్‌ ఇండియా మూవీ అవుతుంది. జాతీయ స్థాయిలో సరిహద్దులను ఈ చిత్రం చెరిపేస్తుంది’’ అని అన్నారు. 

ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథ అందిస్తున్నారు. ఇందుకు  కథని  సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో నిధి వేట ఇతివృత్తంగా ఒక కథ సిద్ధం చేయగా, జేమ్స్‌బాండ్‌ తరహాలో యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా దీన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన  ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.  

click me!