Chiranjeevi:ఈ వీడియోని షేర్ చేస్తూ చిరు పై ట్రోలింగ్, మరీ దారుణం

Surya Prakash   | Asianet News
Published : Apr 27, 2022, 09:22 AM IST
Chiranjeevi:ఈ వీడియోని షేర్ చేస్తూ  చిరు పై ట్రోలింగ్, మరీ దారుణం

సారాంశం

చిరంజీవి ఆరు ప‌దుల వ‌య‌స్సులోకూడా ఇంత ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా ఉండ‌డం చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.  


మెగాస్టార్ చిరంజీవి మీడియా ముందు ఎంతో హుందాగా ఉంటారు. అయితే సినిమా పంక్షన్ లో మాత్రం తనలోని చిలిపిదనాన్ని బయటకు కూడా తెస్తుంటారు. ప్రసంగం ఇచ్చే క్రమంలో ఒక్కోసారి హీరోయిన్ల మీద నాటీ కామెంట్లు చేస్తుండటం మనం గమనించవచ్చు. రీసెంట్ గా తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ కొంటె కామెంట్లే చేశారు. తాజాగా ‘పూజ ఈజ్ సో క్యూట్. నా భార్య నిన్ను చూసినప్పుడల్లా.. ఓ రకంగా ప్రేమించేస్తుంటుంది. సురేఖ నీ నవ్వుకు పెద్ద ఫ్యాన్. నీ నవ్వు బాగుంటుంది అని ఎప్పుడూ నాతో చెబుతుంటుంది. ఈ మూవీలో రాంచరణ్‌ కు జోడిగా చేశావ్ కానీ.. నాతో చేస్తే ఇంకా బాగుండేది’ అంటూ మొన్ననే ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి.. పూజా హెగ్డే పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు వాటికి మరింత మైలేజ్ ఇచ్చారు చిరు.

‘ఆచార్య’ ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం  అయ్యాక  హీరోయిన్ పూజా హెగ్డేతో చిరు చేసిన ఫన్ మాములుగా లేదంటున్నారు ఫ్యాన్స్. ఈ వేడుకకి పూజా హెగ్డే చాలా బాగా రెడీ అయ్యి వచ్చింది. బ్లాక్ సారీలో ఆమె ‘ఆచార్య’ మీడియా సమావేశానికి హాజరైంది. అక్కడికొచ్చిన జనాలను పూజ కళ్ళు తిప్పుకోకుండా చేసింది అనే చెప్పాలి. చిరు అయితే ఆమెను హగ్ చేసుకుంటున్నట్టు, రాంచరణ్ ను పక్కకు తోసేస్తున్నట్టు చేసి నవ్వులు పూయించారు.. ఆ వీడియో వైరల్ అవుతోంది.
 
 చిరంజీవి ఆరు ప‌దుల వ‌య‌స్సులోకూడా ఇంత ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా ఉండ‌డం చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అయితే అదే సమయంలో కొందరు యాంటి ఫ్యాన్స్ తన కుమార్తె వయస్సు ఉన్న పూజతో స్టేజీపై ఏంటా వికారాలు అంటూ సోషల్ మీడియాలో వెటకారాలు చేస్తున్నారు. అయితే చిరులో ఉన్న ఫన్ సైడ్ ని మనం తీసుకోవాలని చాలా మంది రిప్లై ఇస్తున్నారు. 

ఇక ఏప్రిల్ 29న ఆచార్య విడుద‌ల కానున్న నేప‌థ్యంలో కొద్ది రోజులుగా చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డే ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌లో తెగ యాక్టివ్‌గా పాల్గొంటున్న సంగతి తెలసిందే. ఈ క్రమంలో  ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌గా,ఈ కార్య‌క్ర‌మంలో పూజా త‌న అంద‌చందాల‌తో ఆక‌ట్టుకుంది. ఇక చిరంజీవి స్టైల్, స్వాగ్ గురించి చెప్పుకొచ్చింది.చిరంజీవి గారి దగ్గర స్వాగ్, స్టైల్ చాల ఉంది. నాక్కూడా కొంచెం స్వాగ్ ఇవ్వండి. రామ్.. నా సిద్ద. ప్రతీ సినిమాతో నువ్ బెటర్ అవుతున్నావ్. ఆ సీక్రెట్ నాకు తెలియడం లేదు. ఆయన చాలా కామ్‌గా ఉంటాడు. యాక్షన్ చెప్పినప్పుడే ఆ ఎనర్జీని బయటకు తీస్తాడు. మళ్లీ ఆయనతో పని చేయాలని ఎదురుచూస్తున్నాను. ఆచార్య నెరేషన్ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి.. సినిమా చూశాక అందరికీ కూడా అలానే అనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరు..పూజా హెగ్డే గురించి మాట్లాడుతూ.. పూజ సో క్యూట్. నా భార్య నిన్ను చూసినప్పుడల్లా.. ఓ రకంగా ప్రేమించేస్తుంటుంది. సురేఖ నీ నవ్వుకు పెద్ద ఫ్యాన్. నీ నవ్వు బాగుంటుందని ఎప్పుడూ నాతో చెపుతుంది. ఇక రామ్‌ చరణ్‌తో జోడిగా చేశావ్ కానీ.. నాతో చేస్తే ఇంకా బాగుండేది’ అని అన్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?