బాహుబలితో పోల్చడం కరెక్ట్ కాదు.. నిర్మాత శోబు అసంతృప్తి

By Prashanth MFirst Published May 3, 2019, 8:34 PM IST
Highlights

అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్ రికార్డుల గోల ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలు మీడియాల్లో కూడా సినిమాకు సంబందించిన కథనాలు చాలానే వస్తున్నాయి. అయితే సినిమాపై ఇటీవల బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎనలిస్ట్ తరన్ ఆదర్శ్ వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో కాస్త హాట్ టాపిక్ మారింది. 

బాహుబలి నిర్మాతల్లో ఒకరైన శోబు యార్లగడ్డ సైతం తరుణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ కు విశ్లేషణను తప్పుబట్టారు. ఇంతకు తరుణ్ అదుర్స్ ఏమన్నారంటే.. అవెంజ‌ర్స్..ది ఎండ్ గేమ్` ఫస్ట్ వీక్ రూ.260.40 కోట్ల‌ను కలెక్ట్ చేసిందని అన్నారు. 

ఇక ఆ తరువాత తొలివారంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు బాహుబ‌లి రూ.247కోట్లు, సుల్తాన్ రూ.229.16 కోట్లు, టైగ‌ర్ జిందా హై రూ 206.04కోట్లు, సంజు రూ.202.51 కోట్లు, దంగ‌ల్ రూ.197.54కోట్టు అని పేర్కొన్నారు. ఈ పోలిక కరెక్ట్ కాదని శోబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 

ఎందుకంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ అన్ని భాషల్లో సాధించిన వసూళ్లను బాహుబలి 2 ఒక్క హిందీ భాషలో వచ్చిన కలెక్షన్స్ తో పోల్చారు. దీంతో ఇది కరెక్ట్ కాదని మీరు చెప్పిన సినిమాలు సాధించిన విజయాల్ని పక్కనపెట్టేయడం తగదని, పాన్ ఇండియాన్ మూవీ అన్ని భాషల్లో సాధించిన వసూళ్లు బాహుబలి సెకండ్ పార్ట్ వసూళ్లతో సమానమని అన్నారు. శోబు ట్వీట్ కు బాహుబలి సినిమాటోగ్రాఫర్ సైతం మద్దతు పలికారు.

click me!