మూడో హౌజ్ మేట్ కోసం జరిగే పోటీలో సరిగా వ్యవహరించని సంచాలక్ సందీప్‌పై కూడా మండిపడ్డాడు. తన విధులు సరిగా చేయలేకపోయాడని, అర్థం చేసుకోలేకపోయాడని నాగార్జున ఫైర్ అయ్యాడు.
బిగ్ బాస్ తెలుగు 7 మూడో వారాంతంకి చేరుకుంది. శనివారం ఎపిసోడ్‌లో నాగ్ చాలా మంది కంటెస్టెంట్లపై ఫైర్ అయ్యాడు. వాళ్లు ఆడుతున్న ఆట తీరు పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశాడు. వారిలో టేస్టీ తేజ, అమర్ దీప్, రతికలు ప్రధానంగా ఉన్నారు. వీరితోపాటు శుభ శ్రీ, ప్రశాంత్ లు కూడా పెద్దగా ఆడటం లేదని మండిపడ్డాడు. సందీప్‌పై ఏకంగా ఫైర్ అయ్యాడు. మొత్తంగా కంటెస్టెంట్లు చేసిన పొరపాట్లని నాగార్జున చెప్పారు. నిలదీశాడు, వారిపై ఫైర్ అయ్యాడు.
ఇందులో ప్రధానంగా మూడో హౌజ్ మేట్ కోసం జరిగే పోటీలో సరిగా వ్యవహరించని సంచాలక్ సందీప్‌పై కూడా మండిపడ్డాడు. తన విధులు సరిగా చేయలేకపోయాడని, అర్థం చేసుకోలేకపోయాడని నాగార్జున ఫైర్ అయ్యాడు. అంతేకాదు ఇతర హౌజ్ మేట్స్ ని కూడా నిలదీశాడు నాగార్జున. ఇక మూడో వారం హౌజ్‌లో స్థానం సంపాదించేందుకు జరిగిన పోటీలో శోభా శెట్టి, ప్రియాంక చివరి పోటీ పడగా, ఇందులో శోభా శెట్టి విన్నర్ అయ్యారు. సందీప్, శివాజీ తర్వాత శోభా మూడో హైజ్ మేట్ కావడం విశేషం.
అనంతరం సేఫ్ గేమ్ ఆడుతున్నది ఎవరు, ఎవరు గేమ్ ఛేంజర్ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో యావర్‌గా గేమ్ ఛేంజర్‌గా నాలుగు ఓట్లు పడ్డాయి. దీంతో హౌజ్‌లో గేమ్ ఛేంజర్ అయ్యాడు. ఇక సేఫ్ గేమ్‌కి సంబంధించి తేజకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఆయన సేఫ్‌గా ఆడుతున్నాడని చెబుతున్నారు. దీంతో ఆయనకు పనిష్‌మెంట్‌గా హౌజ్‌లో అంట్లు అన్ని తోమే శిక్ష వేశాడు. మరోవైపు సంచాలక్‌కగా సరైన విధంగా ఆడలేడని, అతనికి రెండు రోజులపాటు జైల్లో ఉండే శిక్ష వేశారు.
ఇందులో రతిక సైలెంట్‌గా ఉందని, గేమ్ ఆడటం లేదని బిగ్ బాస్ తెలిపారు నాగార్జున. దీనికి ఆమె కూడా ఒప్పుకుంది. దీంతో ఆమె పవర్ గ్రీన్ నుంచి ఎల్లోకి అట్నుంచి రెడ్ సింబల్‌లో కి డౌన్ అయిపోతుందని తెలిపారు. అయితే ఇందులో తనకు తన మాజీ లవ్ స్టోరీ గుర్తొస్తుందని చెప్పడం విశేషం. ఎక్స్ అంటే అయిపోయిన టైమ్ అని, దాన్ని మళ్లీ గుర్తు తెచ్చుకోవద్దని, దాన్ని దాటుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు.