కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇటీవల క్యాన్సర్‌తో పోరాడిన విషయం తెలిసిందే. గత నాలుగు నెలల క్రితమే ఆయన క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇటీవలే ఆయన `45` అనే మూవీ చిత్రీకరణలో పాల్గొని దాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఉపేంద్రతోపాటు శివరాజ్ కుమార్ నటించడం విశేషం.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇటీవల క్యాన్సర్‌తో పోరాడిన విషయం తెలిసిందే. గత నాలుగు నెలల క్రితమే ఆయన క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇటీవలే ఆయన `45` అనే మూవీ చిత్రీకరణలో పాల్గొని దాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఉపేంద్రతోపాటు శివరాజ్ కుమార్ నటించడం విశేషం.
ఈ చిత్ర టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శివరాజ్ కుమార్ మాట్లాడారు. క్యాన్సర్‌పై పోరాటం గురించి ఓపెన్ అయ్యారు. తనకు క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు, ట్రీట్‌మెంట్‌కి వెళ్లాలనుకున్నప్పుడు మీ రియాక్షన్ ఏంటనే ప్రశ్నకి శివ రాజ్ కుమార్ స్పందించారు. తాను ఇలా ట్రీట్‌మెంట్‌కి వెళ్లాలనుకున్నప్పుడు తన మైండ్ లో ఉన్నది మూడే అంశాలు అని, ఫ్యామిలీ రెస్పాన్సిబులిటీ, కమిట్‌మెంట్స్, భవిష్యత్‌లో ఏం జరగబోతుందనేది నా మైండ్‌లో తిరుగుతుంది.
ఇది ఎలా ఉండబోతుంది? ఏం చేయాలి? హ్యాపీనా కాదా అనే ప్రశ్నలు నా మైండ్‌లో ఉదయిస్తూనే ఉన్నాయి. డాక్టర్లని కలిస్తే వాళ్లు ధైర్యాన్నిచ్చారు. ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పారు. భయపడాల్సిన పనిలేదని వెల్లడించారు. కానీ ఎక్కడో ఒక ఫీయర్ ఉండింది. మనం మనుషులమే కదా, ఆ బాధ ఉంటుంది. ట్రీట్‌మెంట్‌కి వెళ్లే ముందే తన కమిట్‌మెంట్స్ కి సంబంధించిన క్లారిటీ ఇచ్చాను. నేను ఒప్పుకున్న ప్రాజెక్ట్ లు కంప్లీట్ చేస్తానని చెప్పాను. వాళ్లు కూడా మీకు టైమ్ లేదు, ట్రీట్‌మెంట్‌కి వెళ్లాలని తెలిపారు.
అందుకే నేను ట్రీట్‌మెంట్‌కి వెళ్లేముందు హైదరాబాద్‌కి వచ్చాను. బాలకృష్ణ 50ఏళ్ల సెలబ్రేషన్‌లోనూ పాల్గొన్నాను. ఆ తర్వాత ట్రీట్‌మెంట్‌కి వెళ్లాను. కీమో థెరఫీ జరిగిన నాలుగు, ఐదు రోజులకే మళ్లీ తిరిగి వచ్చాను. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నాను. అప్పుడు ఈ విషయం చెబితే టీమ్ వాళ్లు ఎమోషనల్ అయ్యారు. డైరెక్టర్ చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ నేను సినిమా పూర్తి చేస్తానని చెప్పాను. కానీ రవి వర్మ మీరు ఇది చేయోద్దు, ఇలా మ్యానేజ్ చేద్దామని చెప్పారు. కానీ నేను చేస్తానని చెప్పాను, ఎందుకంటే నా ప్రజలను మోసం చేయదలుచుకోలేదు. ఛీటింగ్ చేయడం మంచిది కాదు, షూటింగ్‌లో పాల్గొనే కరేజ్ నాకు ఉంది, నేను చేయగలను అని చెప్పాను. చెప్పినట్టుగానే ఉపేంద్ర, నా టీమ్ ఇలా అందరు సపోర్ట్ తో ఈ మూవీ షూటింగ్ పూర్తి చేశాను` అని తెలిపారు శివరాజ్ కుమార్.