Shilpa Shetty : బిగ్ బాస్ 15 నుంచి షమితా శెట్టి ఎలిమినేషన్ పై స్పందించిన శిల్పా శెట్టి..

Published : Jan 31, 2022, 02:57 PM IST
Shilpa Shetty : బిగ్ బాస్ 15 నుంచి షమితా శెట్టి ఎలిమినేషన్ పై స్పందించిన శిల్పా శెట్టి..

సారాంశం

ప్రతిష్టాత్మకమైన బిగ్ బాస్ 15 ట్రోఫీని గెలుచుకోవాలని తన సోదరి షమితా శెట్టి కోసం నిరంతరం తాపత్రయ పడింది నటి శిల్పాశెట్టి. బిగ్ బాస్ 15 ఫైనల్ సందర్భంగా షమితా శెట్టి ఎలిమినేషన్‌ పై శిల్పా స్పందించింది.   

నటిగా, ప్రోడ్యూసర్ గా, బిసినెస్ విమెన్ గా తన కేరీర్ లో దూసుకుపోతున్న శిల్పా శెట్టి తాజాగా బిగ్ బాస్ 15 సెట్ వెలుపల కనిపించింది. ప్రతిష్టాత్మకమైన బిగ్ బాస్ 15 ట్రోఫీని తన సోదరి షమితా శెట్టి గెలుచుకోవాలని శిల్పా శెట్టి ఎంతగానో ఆకాంక్షించింది. కానీ తన అంచనాలు తారుమారయ్యాయి.

దేశంలోనే హాట్ ఫేవరెట్ రియాలిటీ షోగా బిగ్ బాస్ ఉంది. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan)నేతృత్వంలో ఏళ్ల తరబడి సక్సెస్ ఫుల్ గా సాగింది.  ఇక నాలుగు నెలల క్రితం బిగ్ బాస్ సీజన్ 15 ప్రారంభం కాగా జనవరి 30 ఆదివారం గ్రాండ్ ఫినాలే చోటు చేసుకుంది. టైటిల్ కోసం ఐదుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ లో పోటీపడగా ప్రేక్షకులు తేజస్వి ప్రకాష్ కి పట్టం కట్టారు. అత్యధిక ఓట్లు సంపాదించినా తేజస్వి టైటిల్ గెలుచుకున్నారు. 

మిస్టర్ షెహజ్ పాల్ రన్నర్ గా నిలిచాడు. బుల్లితెర యాక్ట్రెస్ గా పాపులారిటీ ఉన్న తేజస్వి ప్రకాష్(Tejasswi Prakash) టైటిల్ ఫేవరేట్ గా షోలోకి ఎంటర్ అయ్యారు. హౌస్ లో ఆమె ముక్కుసూటి తనం, ఏదైనా నిర్భయంగా మాట్లాడే తత్వం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ షో సమయంలో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. ప్రేక్షకులు మూకుమ్మడిగా ఓట్లు వేసి గెలిపించారు. టైటిల్ గెలుచుకున్న తేజస్వి ఆనందం వ్యక్తం చేశారు.

 

బిగ్ బాస్ 15 గ్రాండ్ ఫినాలేలో  షమితా శెట్టి  థర్డ్ రన్నరప్‌గా నిలవగా, తేజస్వి ప్రకాష్ విన్నర్‌గా, ప్రతీక్ సెహజ్‌పాల్ ఫస్ట్ రన్నరప్‌గా, కరణ్ కుంద్రా సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ఈ సందర్భంగా షమితా గ్రాండ్ ఫినాలీ లో ఎలిమినేట్ కావడంతో శిల్పా శెట్టి  ‘గాడ్ ఈస్ గ్రేట్’ అంటూ స్పందించింది. పలువురు తేజస్వి ప్రకాష్ విజయంపైనా శిల్పా శెట్టి అభిప్రాయాలను అడిగినా బదులివ్వలేదు.  అనంతరం షమితా శెట్టి బిగ్ బాస్ హౌస్ బయట ప్రియుడు రాకేశ్ బాపట్‌తో  కనిపించింది. చిరునవ్వు నవ్వుతో తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Finale: కళ్యాణ్ పడాల తలకు గాయం? సింపతీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారా? నిజమెంత?
అయోమయంలో నందమూరి హీరోల సీక్వెల్ చిత్రాలు.. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురి పరిస్థితి అంతే