రంగుని చూసి విదేశాల్లో దురుసుగా ప్రవర్తిస్తున్నారు.. శిల్పాశెట్టి ఆవేదన!

By Udayavani DhuliFirst Published Sep 24, 2018, 1:55 PM IST
Highlights

నటి శిల్పా శెట్టి సిడ్నీ విమానాశ్రయంలో తనకు జాతి వివక్ష అనుభవం ఎదురైన విషయాన్ని వెల్లడించారు. ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని తెలుపుతూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది. 

నటి శిల్పా శెట్టి సిడ్నీ విమానాశ్రయంలో తనకు జాతి వివక్ష అనుభవం ఎదురైన విషయాన్ని వెల్లడించారు. ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని తెలుపుతూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది. మెల్ బోర్న్ వెళ్లడానికి సిడ్నీ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు శిల్పా శెట్టి.

అక్కడ మెల్ అనే ఉద్యోగిని చెకింగ్ కౌంటర్ వద్ద ఉండగా శిల్ప ఆమె వద్దకు వెళ్లింది. శిల్ప వద్ద రెండు బ్యాగులు ఉండగా.. ఒకటి ఓవర్ వెయిట్ ఉందని సదరు ఉద్యోగిని అభ్యంతరం వ్యక్తం చేసింది. సగానికి పైగా ఖాళీగా ఉన్న బ్యాగ్ ఓవర్ వెయిట్ అని చెప్పడంతో నటి షాక్ తిన్నారు. 

ఓవర్ వెయిట్ ఉన్న లగేజీని చెక్ చేసే కౌంటర్ వద్దకి శిల్పని తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది వెయిట్ చెక్ చేయకుండానే.. ఓవర్ వెయిట్ అని తేల్చేశారు. స్కానర్ ద్వారా కాకుండా స్వయంగా పరిశీలిస్తే విషయం అర్థమవుతుందని నటి ఆ సిబ్బందిని కోరారు.

చెకిన్ కౌంటర్ క్లోజ్ అవ్వడానికి మరో 5 నిమిషాలు మాత్రమే సమయం ఉండడంతో.. త్వరగా చెక్ చేయాలని చెప్పినా సిబ్బంది స్పందించలేదు. చివరికి మరో కౌంటర్ వద్దకు వెళ్లగా.. బ్యాగ్ ఓవర్ వెయిట్ లేదని సిబ్బంది చెప్పడంతో శిల్ప ఊపిరి పీల్చుకున్నారు.

చర్మం రంగును బట్టి ప్రయాణికులతో ప్రవర్తించవద్దు. ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కాంటాస్ ఎయిర్‌వేస్ వారికి సూచించారు. 

click me!