ఘంటసాల బయోపిక్ కూడా సిద్ధమవుతోంది!

Published : Sep 24, 2018, 01:13 PM IST
ఘంటసాల బయోపిక్ కూడా సిద్ధమవుతోంది!

సారాంశం

ఆయన మరణించి 40 ఏళ్ళైనా పాటతో ఇంకా అందరిలో హృదయాల్లో బ్రతికే ఉన్నారు. ఎంత మంది సంగీత దర్శకులు వచ్చినా ఆయన స్థాయిని అందుకోలేరనే చెప్పాలి. పాటకు మరో అర్ధాన్ని చెప్పిన ఆ సంగీత విద్వాంసుడి జీవితంలో  ఎన్నో జీవిత సత్యాలు ఉన్నాయి. 

తెలుగు చిత్ర పరిశ్రమ ప్రారంభమై ఏళ్ళు గడుస్తున్నా ఘంటసాల బాణీలు ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఆయన మరణించి 40 ఏళ్ళైనా పాటతో ఇంకా అందరిలో హృదయాల్లో బ్రతికే ఉన్నారు. ఎంత మంది సంగీత దర్శకులు వచ్చినా ఆయన స్థాయిని అందుకోలేరనే చెప్పాలి. పాటకు మరో అర్ధాన్ని చెప్పిన ఆ సంగీత విద్వాంసుడి జీవితంలో  ఎన్నో జీవిత సత్యాలు ఉన్నాయి. 

అలాంటి గొప్ప సంగీత విద్వాంసుడి జీవితం గురించి తెలుసుకోవాలని ఎవరికీ ఆసక్తి ఉండదు. అందుకే ఘంటసాల బయోపిక్ ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో బయోపిక్ లకు మంచి ఆధారణ అందుతోందని మహానటి సినిమాతో రుజువయ్యింది. ఎమోషన్ కనెక్ట్ అవ్వాలే గాని ప్రేక్షకుడే సినిమాకు ప్రమోషన్ తెచ్చేస్తాడు. గత కొంత కాలంగా ఘంటసాల జీవితం గురించి రీసెర్చ్ చేస్తున్న రచయిత సిహెచ్.రామారావు సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. 

లక్ష్మి నీరజ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఘంటసాల పాత్రలో సింగర్ కృష్ణ చైతన్య నటించనున్నాడు. అలాగే కృష్ణ చైతన్య భార్య మృదుల ఘంటసాల గారి సతీమణి పాత్రలో నటించనున్నారు, వాసురావు సంగీతం అందించనున్న ఈ బయోపిక్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను తెలియజేయనున్నారు. 

 

 

PREV
click me!

Recommended Stories

'అప్పుడు బిగ్ బాస్ చేసిన పనికి ఆశ్చర్యపోయా.. గిఫ్ట్‌గా లిప్‌స్టిక్‌లు పంపించాడు..'
Jana Nayakudu మూవీ `భగవంత్‌ కేసరి`కి కాపీనా, రీమేకా? అసలు నిజం చెప్పిన నిర్మాత.. ట్రోల్స్ కి ఫుల్‌ స్టాప్‌