చిరు-బాలయ్యలలో ఉన్న కామన్ పాయింట్ అదే!

Published : Dec 27, 2022, 01:59 PM IST
చిరు-బాలయ్యలలో ఉన్న కామన్ పాయింట్ అదే!

సారాంశం

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసిన శేఖర్ మాస్టర్ తాజా ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, బాలకృష్ణలలో ఉన్న కామన్ పాయింట్ ఏమిటో వెల్లడించారు. 

దాదాపు ఆరేళ్ళ గ్యాప్ తర్వాత సంక్రాంతి బరిలో దిగుతున్నారు చిరంజీవి-బాలకృష్ణ. వాల్తేరు వీరయ్య-వీరసింహారెడ్డి చిత్రాలతో ఈ సీనియర్ హీరోలు సంక్రాంతి సమరానికి సిద్ధం అవుతున్నారు. భారీ ఫ్యాన్ బేస్ కలిగిన ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే ఒకరకమైన పోటీ వాతావరణం నెలకొంటుంది. మెగా నందమూరి ఫ్యాన్స్ ఈ పోటీని ప్రత్యేకంగా, ప్రెస్టీజియస్ గా చూస్తారు. సంక్రాంతి విన్నర్ మా హీరోనే కావాలని కోరుకుంటున్నారు. 

వాల్తేరు వీరయ్య-వీరసింహారెడ్డి చిత్రాలపై పాజిటివ్ బజ్ ఉంది. అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి సీజన్ కి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే రెండు మూడు సినిమాలు విజయం సాధించిన రోజులు కూడా ఉన్నాయి. ఆడియన్స్ సంక్రాంతి సినిమాలను ప్రత్యేకంగా చూస్తారు. కుటుంబ సభ్యులు మొత్తం పండగ వేళ థియేటర్ కి వెళ్లి సినిమా చూడటం సాంప్రదాయంగా భావిస్తారు. కాబట్టి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు చిత్రాలకు ఆదరణ దక్కినా, భారీ హిట్స్ సాధించినా ఆశ్చర్యం లేదు. 

2020 సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో భారీ విజయాలు నమోదు చేశాయి. కాగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసిన శేఖర్ మాస్టర్ తాజా ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, బాలకృష్ణలలో ఉన్న కామన్ పాయింట్ ఏమిటో వెల్లడించారు. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా శేఖర్ మాస్టర్... చిరంజీవి-బాలకృష్ణలో ఉన్న కామన్ పాయింట్ డెడికేషన్ అన్నారు. 

చిరంజీవి-బాలకృష్ణ మంచి డాన్సర్స్. సాంగ్స్ లో సెట్స్ వేసే క్రమంలో వారి డెడికేషన్ అద్భుతమని ఆయన వెల్లడించారు. శేఖర్ మాస్టర్ వాల్తేరు వీరయ్య సినిమాలో మొత్తం పాటలకు పని చేశారు. వీరసింహారెడ్డి మూవీలో రెండు పాటలకు కొరియోగ్రఫీ అందించారు. ఈ సంక్రాంతి సినిమా ప్రియులకు పండగే అన్న శేఖర్ మాస్టర్... తాను కూడా ఆ రెండు చిత్రాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ