
`శతమానం భవతి` మూవీ ఏడేళ్ల క్రితం సంక్రాంతి స్పెషల్‌గా వచ్చి మంచి విజయం సాధించింది. ఏకంగా జాతీయ అవార్డుని అందుకుంది. కుటుంబనేపథ్య చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. పేరెంట్స్ కి దూరమైన పిల్లలను దగ్గర చేర్చడం, కుటుంబ అనుబంధాలను ప్రతిబింబించే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ అనూహ్యంగా విజయం సాధించింది అందరిని సర్‌ప్రైజ్ చేసింది. సతీష్ వెగేష్న దర్శకత్వం వహించిన ఈ మూవీలో శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించారు. ప్రకాష్ రాజ్, జయసుధ కీలక పాత్రలు పోషించారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌ని తీసుకొస్తున్నారు నిర్మాత దిల్‌రాజు. ఇప్పుడు సంక్రాంతి స్పెషల్‌గా ఈ మూవీని ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ మూవీని తీసుకురాబోతున్నట్టు తెలిపారు. `ఏడేళ్ల క్రితం `శతమానం భవతి` మాయాజాలంతో సంక్రాంతిని జరుపుకుంది. ఇప్పుడు 2025లో మరింత మంత్రముగ్దుల్ని చేసేందుకు మరో అధ్యాయానికి సిద్ధంగా ఉండండి` అని తెలిపారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని తీసుకురాబోతున్నట్టు తెలిపారు. `శతమానం భవతి` నెక్ట్స్ పేజ్ అంటూ దీన్ని ప్రకటించారు.
సంక్రాంతికి వచ్చే ఫ్యామిలీ మూవీస్ మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి `శతమానం భవతి` లాంటి సినిమాని తీసుకురావాలని భావిస్తున్నారు దిల్ రాజు. మరి ఈ సారి ఎలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ తో వస్తుందో చూడాలి. దీనికి సంబంధించిన దర్శకుడు, నటీనటులు ఎవరనేది తెలియాల్సి ఉంది. మున్ముందు ప్రకటిస్తారేమో చూడాలి.