ఆ చెత్తను భోగి మంటల్లో కాల్చేయాలి... హనుమాన్ డైరెక్టర్ బోల్డ్ ట్వీట్ 

Published : Jan 15, 2024, 10:16 AM IST
ఆ చెత్తను భోగి మంటల్లో కాల్చేయాలి... హనుమాన్ డైరెక్టర్ బోల్డ్ ట్వీట్ 

సారాంశం

దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. అదే సమయంలో కొందరు తమ టీమ్ పై సోషల్ మీడియా దాని చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.   

హనుమాన్ మూవీ సంక్రాంతి క్లీన్ హిట్ గా నిలిచింది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ మూవీ భారీ విజయం దిశగా దూసుకువెళుతుంది. కాగా మొదటి నుండి హనుమాన్ మూవీని తొక్కేస్తున్నారనే వాదన ఉంది. సంక్రాంతి బరి నుండి హనుమాన్ చిత్రాన్ని తప్పించాలని చూశారు. ఒత్తిడి చేసినా హనుమాన్ నిర్మాతలు తలొగ్గలేదు. జనవరి 12న విడుదల చేశారు. 

ఇక థియేటర్స్ చాలా తక్కువగా హనుమాన్ చిత్రానికి దక్కాయి. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం కూడా హనుమాన్ చిత్రానికి థియేటర్స్ ఇవ్వలేదు. ఇది వివాదమైంది. మరోవైపు హనుమాన్ టీమ్ పై సోషల్ మీడియా దాడి జరుగుతుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ఆయన ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. 

ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి కొందరు హనుమాన్ టీమ్ పై దాడి చేస్తున్నారు. ఈ చెత్తను భోగి మాటల్లో కాల్చేయాలి అని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశాడు. ప్రశాంత్ వర్మ కామెంట్ వైరల్ అవుతుంది. హనుమాన్ మూవీ భారీ విజయం దిశగా దూసుకువెళుతుంది. పోటీగా విడుదలైన చిత్రాలు మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా హనుమాన్ క్లీన్ హిట్ గా నిలిచింది. మూడు రోజుల్లో బ్రేక్ ఈవెంట్ అయ్యింది. 

హనుమాన్ మూవీ సోషియో ఫాంటసీ అంశాలతో తెరకెక్కింది. తేజ సుజా సూపర్ మ్యాన్ రోల్ చేశాడు. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా చేసింది. 
 

PREV
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు