శతమానం భవతి సెన్సార్ పూర్తి..జనవరి 14న విడుదల

Published : Dec 28, 2016, 09:48 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
శతమానం భవతి సెన్సార్ పూర్తి..జనవరి 14న విడుదల

సారాంశం

శర్వానంద్ - దిల్ రాజు ల శతమానం భవతి సెన్సార్ పూర్తి. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల  చేసేందుకు ముహూర్తం కుటుంబ బంధాలపై తెరకెక్కిన శతమానంభవతి  

ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం "శతమానం భవతి".  అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక గా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

 

ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమం నేడు హైదరాబాద్ లో పూర్తి అయ్యింది. కుటుంబ కథా నేపధ్యం లో సాగే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి క్లీన్ U సర్టిఫికెట్ లభించింది. 

 

" శతమానం భవతి  తాతా మనవళ్ల  మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. జనవరి 14 న సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుంది. సంక్రాంతి కి కుటుంబ సమేతం గా చూసి ఆనందించే చిత్రం మా శతమానం భవతి. ఇది శర్వానంద్ 25 వ చిత్రం కావటం విశేషం. మిక్కీ అందించిన సంగీతం ఇప్పటికే పెద్ద హిట్ అయ్యింది.  బొమ్మరిల్లు సినిమా మా సంస్థ కి ఎంత పేరు తెచ్చిందో , ఈ చిత్రం కూడా అంతే పేరు ని తెస్తుంది అన్న నమ్మకం ఉంది ", అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.  

 

 ఈ చిత్రం లో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ , జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

 

ఈ చిత్రానికి కథ - దర్శకత్వం - మాటలు - స్క్రీన్ప్లే : సతీష్ వేగేశ్న , 

ఎడిటింగ్ - మధు ,

సినిమాటోగ్రఫి  - సమీర్ రెడ్డి, 

సంగీతం -  మిక్కీ జె మేయర్,

నిర్మాతలు : రాజు , శిరీష్

PREV
click me!

Recommended Stories

kalyan padala love story: నా కంటే వాడు బెటర్‌గా ఉన్నాడని వెళ్లిపోయింది.. కళ్యాణ్‌ క్రేజీ లవ్‌ స్టోరీ, ఎంత మోసం చేసింది
Vana Veera Review: `వన వీర` మూవీ రివ్యూ, రేటింగ్‌.. సినిమా ఎలా ఉందంటే?