నికిషాకు పిచ్చెక్కిందా..లేక తిక్కెక్కిందా

First Published Dec 28, 2016, 8:59 AM IST
Highlights
  • పవన్ సరసన నటించాలని అనుకోలేదట
  • దర్శకుడు బలవంతం చేస్తేనే కొమురంపులితో చేసిందట
  • అయినా ఇప్పుడెందుకు చెప్తోందో... ఏం లాభం ఆశిస్తోందో
  • పవన్ కళ్యాణ్ ను కాదంటే పబ్లిసిటీ వస్తుందనా.. ఏంటి

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ సరసన హీరోయిన్‌గా న‌టించే అవకాశమంటే ఏ హీరోయిన్ కయినా నక్కతోక తొక్కినంత లక్కీగా అనిపిస్తుంది. కానీ ఓ హీరోయిన్ మాత్రం అదేం లేదు.. తాను ప‌వ‌న్‌తో న‌టించ‌డానికి ఆస‌క్తి చూప‌లేద‌ని అంటోంది. అంతటితో ఆగకుండా పవన్ సరసన తాను హీరోయిన్ గా చేసిన ఆ సినిమా... కేవలం డైరెక్ట‌ర్ బ‌ల‌వంతం చేస్తేనే న‌టించ‌డానికి ఒప్పుకున్నాన‌ని అంటోంది. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు.. పవన్ కళ్యాణ్ కొమురం పులిలో నీటుగా నాటుగా నటించిన నికిషా ప‌టేల్‌.

ఈ అమ్మ‌డు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఎస్‌.జె.సూర్య కాంబినేష‌న్‌లో రిలీజైన పులి చిత్రంలో హీరోయిన్‌గా న‌టించింది. పులి బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ కావ‌డంతో నికిషా ప‌టేల్‌కు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. మ‌ధ్య‌లో చాలా గ్యాప్ వ‌చ్చినా, ఇప్పుడిప్పుడే మళ్లీ అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

 

పవన్ కళ్యాణ్ కొమురంపులి సినిమా గతంలో ఎప్పుడో విడుద‌లైంది.. మ‌రిప్పుడు నికిషా ఈ సినిమాలో ప‌వ‌న్ ప‌క్క‌న న‌టిండానికి ఆస‌క్తి లేకున్నా దర్శకుని బలవంతం వల్ల నటించానని చెప్ప‌డంలో ఆంతర్యమేమిటా అని జుట్టు పీక్కుంటున్నారు ఫిలిం సర్కిల్ లో. ఇదంతా కేవలం ప‌బ్లిసిటీ స్టంట్ అంటున్నారు.

మరి ఇప్పుడిప్పుడే తిరిగి గాడిలో పడుతున్న సెక్సీ లేడీ నికిషా కరియర్ తిరిగి నిలిబడుతుందా లేక మళ్లీ దెబ్బై పోతుందా అనేది చూడాలి.

click me!