
శర్వానంద్, రీతూ వర్మ జంటగా అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ వచ్చిందని ట్రేడ్ అంటోంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో కలిసిన మీడియాతో....శర్వానంద్ మాట్లాడుతూ... ఓ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
క్యారక్టర్ కోసం బరువు పెడిగి కనపడాల్సిన కథలు నేను ఒప్పుకోను అని చెప్పారు. ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటానని చెప్పారు. బొద్దుగా లావుగా ఉన్న శర్వానంద్ స్లిమ్ లుక్‌లోకి మారేందుకు సుమారు 6 నెలలకుపైగా వర్కవుట్ చేశాడు. కేవలం బరువు తగ్గడం కోసం మాత్రమే కాదని, పర్‌ఫెక్ట్ ఫిజిక్ కోసం కూడా బ్రేక్ తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. మళ్లీ బరువు పెరగడం పై శర్వా స్పందిస్తూ..ఒక వేళ బరువు పెరగాలంటే నేను సినిమా చేయను. అన్నింటికంటే నా ఆరోగ్యం ముఖ్యం. నేను మళ్లీ బరువు పెరగడం ఇష్టం లేదు. నేను ఫిట్‌గా మారేందుకు 9 నెలలు పట్టింది. బరువు పెరగడం సులభవం..కానీ బరువు తగ్గి శరీరాన్ని చక్కదిద్దుకోవడం కష్టమైన పని..నేను మళ్లీ ఆ మెంటల్ ట్రామాలోకి వెళ్లలేనంటూ చెప్పుకొచ్చాడు.
ఈ చిత్రదర్శకుడు శ్రీకార్తీక్ మాట్లాడుతూ – ‘‘నటుడిగా ట్రై చేసి, అవకాశాలు రాకపోవడంతో ఆ ఫ్రస్ట్రేషన్‌లో నేనే రాయాలి, నేనే తీయాలనుకుని కొన్ని షార్ట్ ఫిల్మ్స్, యాడ్ ఫల్మ్స్ చేశాను. నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు మా అమ్మగారు అపస్మారక స్థితిలో ఉన్నారు. నేను ఫిల్మ్‌మేకర్‌ను అవుతానని కూడా ఆమెకు తెలియదు. ఈ విషయంలో నాకు పశ్చాత్తాపం ఉండేది. దాంతో కాలాన్ని వెనక్కి తీసుకుని వెళ్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ‘ఒకే ఒక జీవితం’ కథ రాసుకున్నాను. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని టైమ్ మిషన్ బ్యాక్‌డ్రాప్ పెట్టాను. ఈ సినిమాకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. శర్వానంద్ లాంటి హీరో ఇలాంటి సినిమాను యాక్సెప్ట్ చేయడమే పెద్ద సక్సెస్. కథ విన్న వెంటనే అమలగారు ఒప్పుకున్నారు. ఇక అల్లు అర్జున్ గారి కోసం నా దగ్గర ఓ రియల్ ఫ్యాంటసీ కథ ఉంది’’ అన్నారు.