శర్వానంద్ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
శర్వానంద్ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ కథానాయికలు. పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. టైటిల్ గా 'రణరంగం'ని ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ ఉదయం నుండి చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు అదే టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్ట్ వదిలారు.
పోస్టర్ లో శర్వానంద్ గుబురు గడ్డంతో బీడీ కాలుస్తూ రఫ్ లుక్ లో కనిపించారు. ఈ పోస్టర్ సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో యంగ్‌స్టర్‌గా, మిడిల్ ఏజ్డ్ గ్యాంగ్ స్టర్ గా శర్వా డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం.
ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ ఏడాది ఆగస్ట్ 2న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.