మెంటల్ క్వీన్ తో ఖాన్?

Published : Mar 01, 2019, 05:53 PM IST
మెంటల్ క్వీన్ తో ఖాన్?

సారాంశం

బాలీవుడ్ వివాదాల రాణి కంగనా రనౌత్ హీరోయిన్ గా క్రేజ్ ఎంతగా పెరుగుతుందో అలాగే వివాధాల డోస్ కూడా పెరుగుతుంది. ఇటీవల మణికర్ణిక సినిమాతో బాక్స్ వద్ద బాగానే ఓపెనింగ్స్ ను అందుకున్నప్పటికీ సినిమాను కొన్న బయ్యర్స్ కు పెద్దగా లాభాలు రాలేవు. ఇక నెక్స్ట్ ఈ సుందరి 'మెంటల్ హై క్యా; అనే సినిమాతో రాబోతోంది.  

అయితే ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించడానికి షారుక్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఖాన్ త్రయంపై కూడా నెగిటివ్ కామెంట్స్ చేసిన కంగనా ఇప్పుడు తన సినిమాలో ఒక స్పెషల్ పాత్ర కోసం కింగ్ ఖాన్ ని స్వీట్ గా సంప్రదించిందట. దీంతో షారుక్ కూడా మెంటల్ పిల్ల సినిమాకు డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. 

ఇక ఈ సినిమాకు కె.రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. అనగనగా ఒక ధీరుడు - సైజ్ జీరో వంటి డిజాస్టర్స్ అందుకున్న ప్రకాష్ బాలీవుడ్ లో అయినా మొదటి హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.  

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!