
బాలీవుడ్ లో యంగ్ స్టర్స్ లో హీరోయిన్ అనన్య పాండే ఒకరు. ఆమె సినిమాల ద్వారా స్టార్ స్టేటస్ సాధించింది. అటు తన తండ్రి స్టార్ డమ్ తో తను కూడా స్టార్ గా చలామని అవుతున్నాడు షారుఖ్ తనయుడు ఆర్యాన్ ఖాన్. ఈ మధ్య డ్రగ్స్ కేసులో `ఇంకా పాపులర్ అయ్యాడు. ఇండస్ట్రీ అంతా అతనికి ఆటిట్యూడ్ ఎక్కువ అని ఓ పేరు ఉంది. అది నిజం అని చాలా సార్లు తానే నిరూపించుకున్నాడు. ఇక తాజాగా మరో సారి అది ఫ్రూ చేశాడు ఆర్యన్ ఖాన్.
బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తనకు షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ అంటే క్రష్ అంటూ మనసులో మాట చెప్పేసింది. అటువంటిది.. తాజాగా మజా మా స్క్రీనింగ్ టైమ్ లో ఇద్దరు ఎదురు పడ్డారు. అనన్య పాండే ఎదురుగా ఉన్నా సరే ఆర్యన్ ఖాన్ చూసీ చూడనట్టు వెళ్ళిపోయాడు. పక్కకు తప్పుకుని మరీ పొగరుగా వెళ్ళాడు కాని.. కనీసం పలకరించలేదు. దాంతో అంతా అవాక్ అయ్యారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. షారుఖ్ కొడుక్కి ఇంత బలుపేంటి అంటూ కొందరు అంటుంటే.. తండ్రిని చూసి నేర్చుకో ఒదిగి ఉండటం అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొంత మంది మాత్రం ఏదో పరద్యానం లో ఉండి చూసుకోలేదేమో అని అంటున్నారు. మరికొంత మంది మాత్రం మరోసారి తన పొగరుబోతుతనం బయట పడిందంటున్నారు. ఏది ఏమైనా ఎదురుగా ఉన్న మనిషి వైపు చూసీ చూడనట్టు వెళ్లడం కన్నా.. ఓ చిన్న చిరునవ్వు నవ్వితే పోయేదేముంది అంటున్నాడు ఆడియన్స్.
షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ పలు వివాదాలు కోరి మరీ తెచ్చుకున్నాడు. ఆ మధ్య బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని కొన్ని రోజులు జైల్లో గడిపాడు. ఆ టైమ్ లో షారుఖ్ మనోవేదన మామూలుగా లేదు. షూటింగ్స్ కు కూడా దూరం అయ్యి.. కొడుక్కి బెయిల్ దొరక్క.. చాలా బాధపడ్డారు బాద్ షా. ఎట్టకేలకు ఎంతో ప్రయత్నం చేయగా.. ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వచ్చింది. అంతే కాదు అతనికి ఈ కేసుతో సంబందం లేదు అని క్లీన్ చిట్ కూడా వచ్చింది. దీనిపై కూడా రకరకాల విమర్షలు ఎదుర్కొన్నారు షారుఖ్ ఫ్యామిలీ.