
వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ దాపు మూడునాలుగేళ్లకు పైగా సినిమాలకు దూరం అయ్యాడు. జీరో సినిమా తరవాత ఆయన చాలా కాలం బయటకు రాలేదు. దాంతో షారుఖ్ ఫ్యాన్స్.. కంగారు పడ్డారు. ఇక రీ ఎంట్రీతో ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేశాడు ఖాన్. ఇక పక్కా ప్లానింగ్ తో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం పటాన్ మూవీ చేస్తున్న షారుఖ్.. తమిళ డైరెక్టర్ అట్లీతో మరో మూవీ చేయబోతున్నాడు.
తమిళనాట మాస్ డైరెక్టర్ గా అట్లీ కుమార్ కి మంచి పేరు ఉంది. విజయ్ హీరోగా ఆయన చేసిన తెరి, మెర్సెల్, బిగిల్ సినిమాలు అక్కడ భారీ విజయాలను సాధించాయి. తెలుగులో డబ్బింగ్ అయిన ఈసినిమాలు ఇక్కడ కూడా మంచి వసూళ్లనే రాబట్టాయి. ఈ నేపథ్యంలోనే తన ఫేవరేట్ హీరో షారుక్ తో సినిమా చేయాలని అట్లీ కుమార్ ఎప్పటి నుంచో అనుకున్నాడు. ఆ కల ఇప్పుడు సాకారం అవుతోంది.
అయితే ఆ మధ్య వరుస ఫ్లాపులతో షారుక్ సతమతమయ్యాడు. అందువలన ఆయన తన సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ మధ్యలో ఆయన అంగీకరించినవి రెండే సినిమాలు. ఒకటి పఠాన్ అయితే మరొకటి డంకి. పఠాన్ షూటింగ్ కంప్లీట్ అయ్యే దశలో ఉంది.. ఇక డంకి రీసెంట్ గా మొదలైంది.
ఈ నేపథ్యంలోనే షారుక్ తో చేయాలనుకున్న కథపై కసరత్తు చేస్తూ వచ్చిన అట్లీ కుమార్, మొత్తానికి ఆయనను ఒప్పించినట్టు సమాచారం. ఈ సినిమాకి టైటిల్ కూడా ఫిక్స్ చేశాడట అట్లీ. షారుఖ్ మూవీకి పవర్ ఫుల్ గా ఉండేట్టు.. జవాన్ అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార పేరు వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందట.