జీరో దెబ్బకి రీమేక్ ట్రీట్మెంట్!

By Prashanth MFirst Published Dec 24, 2018, 3:39 PM IST
Highlights

కెరీర్ లో మంచి ఊపుమీద ఉన్నప్పుడు వరుసగా ఫ్లాప్స్ వచ్చే సందర్భం ఎప్పుడో ఒకప్పుడు రక మానదు. ఆ సమయంలో ప్రయోగాల కన్నా హిట్టు కథను నమ్ముకోవడం బెటర్. అదే రీమేక్ మంత్రా. ఇప్పుడు షారుక్ ఖాన్ కూడా అదే తరహాలో అడుగులు వేసేందుకు సిద్దమయ్యాడు.

కెరీర్ లో మంచి ఊపుమీద ఉన్నప్పుడు వరుసగా ఫ్లాప్స్ వచ్చే సందర్భం ఎప్పుడో ఒకప్పుడు రక మానదు. ఆ సమయంలో ప్రయోగాల కన్నా హిట్టు కథను నమ్ముకోవడం బెటర్. అదే రీమేక్ మంత్రా. ఇప్పుడు షారుక్ ఖాన్ కూడా అదే తరహాలో అడుగులు వేసేందుకు సిద్దమయ్యాడు. సౌత్ లో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న 'విక్రమ్ వేధా'ను హిందీ ప్రేక్షకులకు చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. 

గత కొన్నేళ్లుగా వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న షారుక్ ఖాన్ రీసెంట్ గా జీరో అనే సినిమాను విడుదల చేశాడు. మరగుజ్జు పాత్రలో కనిపించిన షారుక్ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాడు. సినిమా మొదటిరోజే నెగిటివ్ టాక్ ను అందుకోవడంతో కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. జీరో దెబ్బకి షారుక్ మార్కెట్ పై అనుమానాలు మొదలయ్యాయి. దీంతో రీమేక్ ట్రీట్మెంట్ తో సెట్టవ్వలని కింగ్ ఖాన్ రెడీ అవుతున్నాడు. 

తమిళ్ లో విజయ్ సేతుపతి - మాధవన్ నటించిన విక్రమ్ వేధా 2016లో మిస్టరీ డ్రామాగా తెరకెక్కింది. కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ స్టోరీలో షారుక్ ఏ పాత్ర చేస్తాడనేది ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. మిగతా నటీనటులను వీలైనంత త్వరగా పూర్తి చేసి కొత్త ఏడాది ఫ్రెష్ గా కొత్త ప్రాజెక్టును స్టార్ట్ చెయ్యాలని షారుక్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.  

click me!