అల్లు అర్జున్ ని తప్పకుండా కలుస్తా: షారుక్ ఖాన్

By Prashanth MFirst Published Dec 16, 2018, 12:51 PM IST
Highlights

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇప్పుడు నేషనల్ లెవెల్ హీరోల్లో ఒకడిగా మారిపోతున్నాడు. కన్నడ మలయాళం భాషల్లో బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇప్పుడు నేషనల్ లెవెల్ హీరోల్లో ఒకడిగా మారిపోతున్నాడు. కన్నడ మలయాళం భాషల్లో బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక యూ ట్యూబ్ లో మనోడి సినిమాలకు నార్త్ జనాలు తెగ ఎట్రాక్ట్ అవుతున్నారు. హిందీ డబ్బింగ్ సరైనోడు యూ ట్యూబ్ లో టాప్ 1 లో నిలిచినా సంగతి తెలిసిందే. 

బన్నీ టాలెంట్ చూసి నార్త్ జనాలే కాకుండా అక్కడి స్టార్ హీరోలు కూడా ఫ్యాన్స్ గా మారుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని తెగ పొగిడేశాడు. ప్రస్తుతం జీరో సినిమా ప్రమోషన్ లతో బిజీగా ఉన్న షారుక్ నార్త్ హీరోల్లో తనకు చాలా నచ్చిన హీరో అల్లు అర్జున్ అని చెప్పాడు. అతని డ్యాన్స్ స్టైల్ చూసి ఫ్యాన్ అయిపోయానని వివరణ ఇచ్చాడు. 

అదే విధంగా ఆ టాలెంటెడ్ హీరోను ఒకసారి కలిసి తప్పకుండా టైమ్ స్పెండ్ చేస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఆ న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక షారుక్ నటించిన జీరో సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుక్ మరగుజ్జు పాత్రలో కనిపించనున్నాడు. 

click me!