BiggBoss Telugu 5: బిగ్‌బాస్‌ ద్వారా విన్నర్‌ సన్నీ కంటే షణ్ముఖ్‌ సంపాదించిందే ఎక్కువా?

Published : Dec 21, 2021, 05:45 AM IST
BiggBoss Telugu 5: బిగ్‌బాస్‌ ద్వారా విన్నర్‌ సన్నీ కంటే షణ్ముఖ్‌ సంపాదించిందే ఎక్కువా?

సారాంశం

తాజాగా తెలుస్తున్న లెక్కల ప్రకారం..రన్నరప్‌ షణ్ముఖ్‌ కే ఎక్కువ దక్కిందట. ఆయన పారితోషికం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. విన్నర్ సన్నీ కంటే షణ్ముఖే అత్యధికంగా పారితోషికం అందుకున్నారని అంటున్నారు.

బిగ్‌బాస్‌ తెలుగు 5 సీజన్‌ విన్నర్‌గా వీజే సన్నీ నిలిచారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన బిగ్‌బాస్‌ 5 గ్రాండ్‌ ఫినాలేలో విజేత నిర్ణయించే టాస్క్ లో నాగార్జున అందరిని ఉత్కంఠకి గురి చేశారు. సస్పెన్స్ ని లాగి లాగి విన్నర్ ని అనౌన్స్ చేశారు. ముందుగా ఈ సారి స్పెషల్‌ ఉందని, హౌజ్‌లోనే బిగ్‌బాస్‌ విన్నర్‌ తేలిపోతుందని తెలిపారు నాగ్‌. అందుకోసం `జాతిరత్నాలు` ఫేమ్‌ ఫరియా అబ్దుల్లాని లోపలికి పంపించి ఓ గేమ్‌ పెట్టారు. తీరా ఆ గేమ్‌ తూచ్‌ అనిపించింది. ఎప్పటిలాగే నాగ్‌ హౌజ్‌లోకి వెళ్లి టాప్‌ 2 కంటెస్టెంట్లు సన్నీ,షణ్ముఖ్‌లను గౌరవంగా తీసుకొచ్చాడు. 

స్టేజ్‌పైనే అనౌన్స్ చేశాడు. సన్నీని విజేతగా ప్రకటించాడు. దీంతో షణ్ముఖ్‌ రన్నరప్‌గా నిలిచారు. తాను విజేత కావడంతో సన్నీ ఎగిరి గంతేశాడు. నాగ్‌ని ఎత్తుకుని మరీ ముద్దు పెట్టారు. ఎంతో సందడిగా సాగిన ఈఈవెంట్‌తో బిగ్‌బాస్‌ 5 ముగిసింది. సన్నీ విజేతగా నిలవడంతో ఆయనకు యాభై లక్షల ప్రైజ్‌ మనీ, ట్రోఫీతోపాటు ఓ బైక్‌, మూడు వందల గజాల స్థలం దక్కింది. ఈ లెక్కన సన్నీకి బాగానే అందిందని చెప్పొచ్చు. 

కానీ తాజాగా తెలుస్తున్న లెక్కల ప్రకారం..రన్నరప్‌ షణ్ముఖ్‌ కే ఎక్కువ దక్కిందట. ఆయన పారితోషికం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. యాంకర్‌ రవి తర్వాత ఎక్కువ పారితోషికం అందుకున్న కంటెస్టెంట్‌గా షణ్ముఖ్‌ నిలిచాడట. అతనికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని షో నిర్వాహకులు ఒక్క వారానికి గాను నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ముట్టజెప్పారట. మొత్తంగా పదిహేను వారాలకుగానూ షణ్ముఖ్‌ రూ.65 లక్షల పైనే రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది విన్నర్‌ ప్రైజ్‌మనీ కన్నా కూడా ఎక్కువే అని చెప్పొచ్చు. 

ఇదిలా ఉంటే విన్నర్‌ సన్నీపై షణ్ముఖ్‌ టీమ్‌ ఫైర్‌ అవుతున్నారు. ఆయన్ని సోషల్‌ మీడియా వేదికపై ట్రోల్స్ చేస్తున్నారు. సన్నీ కంటే షణ్ముఖ్‌కే ఎక్కువ ఓట్లు పడ్డాయని, కానీ సన్నీని విన్నర్ గా నిలిపారని ఆరోపిస్తున్నారు. హౌజ్‌లో గ్రూపులు క్రియేట్‌ చేసి సన్నీ గెలిచారని అంటున్నారు. ఇలా వరుసగా సన్నీ.. షణ్ముఖ్‌ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడని చెప్పొచ్చు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం