సాధారణంగా దిల్ రాజు సినిమా అంటే అన్నింటిలోనూ ఆయన హ్యాండ్ ఉంటుంది. అయితే ఈ సారి శంకర్ మీదే పెట్టేసారు. తను కేవలం ఫైనాన్స్ అందచేయటమే అన్నట్లు ఉండిపోయారు.
మొత్తానికి “గేమ్ ఛేంజర్” సినిమా కొలిక్కి వచ్చిందని ఆ మధ్యన అందరూ ఆనందపడ్డారు. ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ పోర్షన్ పూర్తై రిలీజ్ కు రెడీ అవుతుందని భావించారు. అనుకున్నట్లుగానే సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తైంది. గోదావరి తీర ప్రాంతాల్లో , వైజాగ్ లోనూ షూటింగ్ చూసి ఫినిష్ చేసారు. అయితే దిల్ రాజు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుందామనుకునేలోగా దర్శకుడు శంకర్ ..ఓ బాంబ్ పేల్చాడని, దాంతో ఇప్పుడు దిల్ రాజు తల పట్టుకు కూర్చున్నారనే వార్త మీడియాలో స్ప్రెడ్ అవుతోంది. అసలేం జరిగింది ..
రామ్ చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దర్శకుడు శంకర్ తో భారీ సినిమా తీయాలనేది దిల్ రాజు డ్రీమ్. అందుకే, ఆయన ఈ భారీ సినిమాని మొదలుపెట్టి ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా పంటి బిగువున ముందుకు వెళ్తున్నారు. ఏడాదిలో పూర్తవుతుందనుకున్న సినిమా షూటింగ్ ఆలస్యం అయి, మూడున్నర సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికే బడ్జెట్ తడిసి మోపెడయింది. ఆ చికాకు ఉన్నా… సినిమా పెద్ద హిట్ అయితే కష్టాలు అన్నీ మర్చిపోవచ్చు. ఆ ఆశతో ఉన్నారు దిల్ రాజు. అందుకే ఎన్ని వడ్డీలైనా కట్టి ఎంత బడ్జెట్ అయినా పెట్టి లాగుతున్నారు.
అయితే రఫ్ కట్ చూసిన తర్వాత దర్శకుడు శంకర్..కొన్ని పోర్షన్స్ రీషూట్ చేయాలని దిల్ రాజుకు చెప్పారట. ఆ రీషూట్ కోసం రామ్ చరణ్ వి నాలుగు నుంచి ఐదు రోజులు డేట్స్ కావాలి. రామ్ చరణ్ ని ఎలాగోలా ఒప్పించి తీసుకువద్దామన్నా శంకర్ సినిమా అంటే భారీ గా ఉంటాయి అన్నీ,వందల్లో క్రూ మెంబర్స్, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ లు కావాలి. వీళ్లందరి డేట్స్ పట్టుకోవటం, మళ్లీ ఖర్చు పెట్టడం నిర్మాతగా దిల్ రాజుకు పెద్ద ఛాలెంజ్. అలాగే ఎగస్ట్రా ఫైనాన్సియల్ బర్డెన్. మరో ప్రక్క రామ్ చరణ్ ..‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు దిల్ రాజు ...రామ్ చరణ్ ని కలిసి ఒప్పించి డేట్స్ తీసుకోవాలి. ఇలా దిల్ రాజుకు ఈ లాస్ట్ మినిట్ ట్విస్ట్ లాంటిది ఊహించనది అయ్యిందంటున్నారు. అయితే ఇలాంటి భారీ సినిమాలకు రీషూట్ లు తప్పనిసరి అనేది నిజం.
'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.. దీని తర్వాత చేస్తున్న మూవీ 'గేమ్ ఛేంజర్' కావటంతో అంచనాలు బాగా ఉన్నాయి. దాదాపు మూడేళ్ల నుంచి సెట్స్‌పైనే ఉంది. డిసెంబర్ 20 న రిలీజ్ ఉండే అవకాసం ఉంది. అలాగే ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన భారతీయుడు-2 ఇటీవల విడుదలైంది. ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. అందరీకీ నష్టాలు మిగిల్చింది. శంకర్ ఏంటి ఇంత పేలవమైన కథ,కథనంతో వచ్చారు. బోర్ గా ఉంది అనే కామెంట్స్ వినిపించాయి. కమల్ హాసన్ కెరీర్ లో ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అని తేల్చారు. ఇప్పుడు ఓటిటి రిలీజ్ లోనూ నెగిటివ్ ట్రెండ్ నడుస్తోంది.. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఇంపాక్ట్ ఖచ్చింగా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ పై ఉంటుందంటోంది ట్రేడ్. దాంతో బిజినెస్ పరంగానూ దిల్ రాజుకు ఇది పెద్ద ఛాలెంజే.