
ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్(Shane Warne) 52ఏళ్ల వయస్సులో శుక్రవారం మరణించారు. ఈసందర్భంగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి(Shilpa Shetty) షేన్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
2016 లో షేన్ వార్న్(Shane Warne) భారతదేశం పర్యటించారు. అప్పుడు శిల్పా శెట్టితో కలిసి షేన్ పేకాట ఆడారు. అంతే కాదు శిల్పా శెట్టి(Shilpa Shetty) కి ఈ ఆటలోని మెళకువలు కూడా నేర్పించారు ఆయన. శిల్పా శెట్టితో పాటు ఆమె భర్త బాలీవుడ్ ప్రొడ్యూసర్ రాజ్ కుంద్ర, మరికొంత మంది అతిధులు లతో కలిస షేన్ పేకాట ఆడారు. అంతే కాదు వాటిలోని మెలకువలను శిల్పాకి నేర్పించారు స్టార్ క్రికెటర్.
షేన్ వార్న్(Shane Warne) క్రికెట్ తో పాటు పేకాటలో మంచి ప్రావీణ్యం ఉంది. ఆయన 2015 లో వరల్డ్ సిరీస్ ఆఫ్ పోకర్ లో పార్టిస్పేట్ చేశారు. అమెరికాలోని లాస్ ఎంజిల్స్ లో జరిగిన ఈవెంట్ లో ఆయన పాల్గోన్నారు. 2016 లో శిల్పా శెట్టి(Shilpa Shetty) ఇంట్లో జరిగిన ఓ ఈవెంట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే ఆయన పోకర్ ను శిల్పాకు నేర్పించారు. అందులో సీక్రట్స్ ను శిల్పాకు వివరించారు.
పోకర్ ఆట ఆడుతూ ఈ స్టార్స్ కొన్ని ఫోటోలకు ఫోజులిచ్చారు, వాటితి తమ సోషల్ మీడియా పేజ్ లో కూడా అప్ లోడ్ చేశారు. ఈ ఫోటోస్ లో షేన్ వార్న్ తో పాటు శిల్పా శెట్టి.. ఆమె భర్త రాజ్ కుంద్రా కూడా గెంతులు వేస్తూ.. ఆటను ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అప్పటి గుర్తులను గుర్తు చేసుకున్నారు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి.
షేన్ వార్న్(Shane Warne) అకాల మరణంతో శిల్పా శెట్టి(Shilpa Shetty) ఆయనకు సంతాపం ప్రకటించారు. షేన్ తో కలిసి ఆడుతున్న రెండు ఫోటోస్ ను ఆమె శేర్ చేశారు. అంతే కాదు లెజెండ్స్ లివ్ ఆన్ అంటూ ట్యాగ్ కూడా రాసిన శిల్పా శెట్టి.. షేన్ వార్న్ తన పోకర్ గురూగా తెలిపింది. ప్రస్తుతం శిల్పా శెట్టితో షేన్ వార్న్ కలిసి ఉన్న ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.