కంగనా విమర్శలకు అలియా షాకింగ్ రిప్లయ్!

Published : Apr 13, 2019, 04:37 PM IST
కంగనా విమర్శలకు అలియా షాకింగ్ రిప్లయ్!

సారాంశం

గత కొద్దిరోజులుగా కంగనా రనౌత్.. అలియా భట్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తోంది. అలియా ప్రేమ వ్యవహారంపై కూడా విమర్శలు చేసింది. 

గత కొద్దిరోజులుగా కంగనా రనౌత్.. అలియా భట్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తోంది. అలియా ప్రేమ వ్యవహారంపై కూడా విమర్శలు చేసింది. అయినప్పటికీ అలియా పెద్దగా పట్టించుకోలేదు. రీసెంట్ గా కంగనా మరోసారి అలియాపై విరుచుకుపడింది.

'మణికర్ణిక' సినిమాలో కంగనా నటనను, 'గల్లీబాయ్'లో అలియా నటనతో పోల్చడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అలియా పెర్ఫార్మన్స్ అంత గొప్పగా లేదని, స్టార్ కిడ్స్ ని పొగడడం ఆపాలంటూ మీడియాకి చురకలు అంటించింది. ఈ విషయంలో అలియా స్పందన కోరగా.. ఆమె ఇచ్చిన రిప్లయ్ చాలా మందిని షాక్ కి గురించి.

అసలు ఏ మాత్రం కంగనాపై ఫైర్ అవ్వకుండా చాలా మెచ్యూర్డ్ గా సమాధానం చెప్పింది. కంగనా వర్క్ అంటే తనకు చాలా గౌరవం ఉందని, తన అభిప్రాయాన్ని గౌరవిస్తానని చెప్పింది. 'రాజీ' సినిమాలో తన నటనను కంగనా ఎంతగాని ప్రశంసించిందని.. మరింతగా కష్టపడితే ఆమె నన్ను పొగిడే రోజు వస్తుందని చాలా తెలివిగా సమాధానం చెప్పింది అలియా.

ఇది విన్న అలియా అభిమానులు ఆమెని మెచ్చుకుంటున్నారు. అనవసరంగా దీన్ని ఇష్యూ చేయకుండా అలియా బాగా ప్రవర్తించిందని కొనియాడుతున్నారు. అలానే కంగనాను తిట్టిపోస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?