
మహేష్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతుంది. `ఎస్‌ఎస్‌ఎంబీ29` పేరిటి ఈ చిత్రం తెరకెక్కనుంది. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. `ఆర్‌ఆర్‌ఆర్`తో ఇండియన్ సినిమా మార్కెట్, ముఖ్యంగా తెలుగు సినిమా మార్కెట్ అంతర్జాతీయంగా విస్తరించింది. `ఆర్‌ఆర్ఆర్` గ్లోబల్ వైడ్‌గా ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. తన హవా చూపించింది. దీనిపై చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏకంగా ఆస్కార్ గెలుచుకుంది. దీంతో అంతర్జాతీయంగా రాజమౌళి ఇమేజ్ పెరిగిపోయింది. ఆయన్నుంచే వచ్చే సినిమాలపై ఆసక్తి నెలకొంది. అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
రాజమౌళి.. నెక్ట్స్ మహేష్‌బాబుతో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వేంచర్ అని ఇప్పటికే రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తెలిపారు. తాజాగా మరో సంచలన అప్‌డేట్ ఇచ్చారు విజయేంద్రప్రసాద్. ఓ మీడియా ఇంటరాక్షన్‌లో ఆయన మాట్లాడుతూ, ఎస్‌ఎస్‌ఎంబీ29 గురించి హింట్ ఇచ్చారు. జులై వరకు స్కిప్ట్ వర్క్ పూర్తవుతుందట. స్క్రిప్ట్ పూర్తి చేసి రాజమౌళి చేతిలో పెడతారట. ఇది ప్రముఖ హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీ `ఇండియానా జోన్స్` సిరీస్ తరహాలో సాగుతుందని, `రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్(1981) తరహాలో అనేక భావోద్వేగాలతో కూడిన అడ్వెంచర్ యాక్షన్ డ్రామా అవుతుందన్నారు విజయేంద్రప్రసాద్.
ఈ సందర్భంగా ఓ క్రేజీ విషయాన్ని బయటపెట్టారు విజయేంద్రపసాద్. ఈ సినిమాకి ఓపెన్ ఎండ్ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. సీక్వెల్ కి అవకాశం ఉండేలా ఓపెన్ ఎండ్(ముగింపు తెరిచే ఉండేలా) ఇస్తున్నామని, సీక్వెల్స్ తీసుకోవచ్చని ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ చెప్పారు. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ ఫ్యాన్స్ కి గూజ్‌బంమ్స్ తెప్పిస్తుంది. వారంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం మహేష్‌బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. `గుంటూరు కారం` పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. మీనాక్షి చౌదరి పేరు మరో కథానాయికగా వినిపిస్తుంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతుంది. నెక్ట్స్ షెడ్యూల్ ఈ రోజు(జూన్ 24) నుంచే ప్రారంభమయ్యింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక మహేష్ ఇక రాజమౌళి సినిమాపైనే ఫోకస్ పెడతారు. ఇందులో హాలీవుడ్ టెక్నీషియన్లు, ఆర్టిస్టులు కూడా పనిచేయబోతున్నారట.