ఇల్లు అమ్ముకుంటున్నావన్న నెటిజెన్ కామెంట్ కి షారుక్ షాకింగ్ రిప్లై

Published : Oct 28, 2020, 03:37 PM IST
ఇల్లు అమ్ముకుంటున్నావన్న నెటిజెన్ కామెంట్ కి షారుక్ షాకింగ్ రిప్లై

సారాంశం

కింగ్ ఖాన్ షారుక్ ఓ నెటిజెన్ వేసిన సెటైర్ కి షాకింగ్ రిప్లై ఇచ్చాడు. సదరు నెటిజెన్ కి షారుక్ ఇచ్చిన రిప్లై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇంతకీ ఆ నెటిజెన్ షారుక్ ని అడిగిన ప్రశ్న ఏమిటంటే...

షారుక్ కెరీర్ కొంచెం నెమ్మదించింది. ఆయన సరైన విజయం అందుకొని చాలా కాలం అవుతుంది. 2018లో ఆయన జీరో అనే ప్రయోగాత్మక చిత్రం చేశారు. షారుక్ ఈ చిత్రంలో మరుగుజ్జు వాడిగా నటించారు. ఎంతో కష్టపడి చేసిన ఆ చిత్రం ఆశించిన ఫలితం అందుకోలేదు. దీనితో షారుక్ కొంత గ్యాప్ తీసుకున్నారు. ఐతే షారుక్ కొత్త మూవీ ప్రకటన చేయాలని ఆయన ఫ్యాన్స్ ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. 

తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీతో షారుక్ మూవీ చేస్తున్నట్లు అనధికారిక ప్రకటనలు రావడం జరిగింది. దర్శకుడు అట్లీ షారుక్ కి కొన్ని స్టోరీ లైన్స్ వినిపించగా..ఓ కథను ఒకే చేశారట. వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న ఆ చిత్రం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుంది . 

కాగా చాలా కాలం తరువాత షారుక్  ఫ్యాన్స్ తో ముచ్చటించదలచారు. దీని కోసం ట్విటర్ లో 'ఆస్క్ మీ ఎనీథింగ్' పేరుతో ఓ చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పిన షారుక్...ఓ నెటిజెన్ సెటైరికల్ క్వశ్చన్ కి షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. 'ఏం భయ్యా...మన్నత్ ని అమ్ముకోబోతున్నారా?' అని ఆ నెటిజెన్ అడుగగా, షారుక్ ' మన్నత్ ని అమ్మడం కుదరదు, తలవంచి దాని కోసం కోరుకోవడం తప్ప. జీవితంలో పైకి రావాలంటే ఇది అవసరం గుర్తించుకో' అని రిప్లై ఇచ్చారు. మన్నత్ అనే పదానికి ప్రార్ధన, ప్రతిజ్ఞ అనే అర్థాలు ఉన్నాయి. షారుక్ ఖాన్ విలాసవంతమైన ఇంటి పేరు మన్నత్ అన్న సంగతి తెలిసిందే. 
 

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్