ఊపిరాడక ఇబ్బందిపడ్డా,నా భార్యకు కూడా కరోనా వచ్చింది

By Surya PrakashFirst Published Oct 28, 2020, 12:40 PM IST
Highlights

ఆస్తమా ఉన్న కారణంగా ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సమయంలో కంగారుపడ్డా. వెంటనే చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చేరాను. మొదట్లో కొన్నిసార్లు ఊపిరాడక ఇబ్బందిపడ్డాను. మూడో రోజుకి వాసన గుర్తించే లక్షణాన్ని కోల్పోయాను. 

ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.  మెగా బ్రదర్ నాగబాబు సైతం కరోనా బారిన పడ్డారు. క‌రోనా వైర‌స్‌ను జ‌యించిన మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు క‌రోనా బాధితుల‌కు అండ‌గా నిల‌బ‌డ్డారు. ప్లాస్మా దానం చేసి కోవిడ్ బాధితుల‌కు ప్రాణ‌దానం చేశారు. కరోనా నుంచి కోలుకున్నాక నాగబాబు ఓ వీడియోని చేశారు. ఇందులో కరోనా సోకిన తర్వాత అయన ఎదురుకున్న కొన్ని అనుభవాలను అందులో పంచుకున్నారు. అదే సమయంలో  కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సమయంలో తాను ఏవిధమైన పరిస్థితులు ఎదుర్కొన్నాననే విషయాన్ని తాజాగా ఆయన వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించినా సరే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని ఆయన సూచించారు.

నాగబాబు మాట్లాడుతూ..‘కరోనాని జయించిన యోధుడిని అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. అంటువ్యాధి నుంచి కోలుకున్న ఓ రోగిని మాత్రమే. ఆస్తమా ఉన్న కారణంగా ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సమయంలో కంగారుపడ్డా. వెంటనే చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చేరాను. మొదట్లో కొన్నిసార్లు ఊపిరాడక ఇబ్బందిపడ్డాను. మూడో రోజుకి వాసన గుర్తించే లక్షణాన్ని కోల్పోయాను. వైద్యులు ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడిన తర్వాత కొన్నిరోజులకు కరోనా లక్షణాలు తగ్గాయి. దీంతో వైద్యులు నన్ను ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. ఇంటికి వచ్చాక మరో వారం రోజులపాటు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నాను.’ అని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా.,...‘నేను ఇంటికి వచ్చే సమయానికి నా భార్య పద్మజకి కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మేమిద్దరం స్వీయ నిర్బంధంలోనే ఉండాల్సి వచ్చింది. అది మాకు కఠిన సమయమే అయినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొగలిగాం. నా భార్య నాకంటే ఆరోగ్యవంతురాలు అందుకే తను వెంటనే కొలుకోగలిగింది. అయితే సాధారణ జీవితంలోకి రావడానికి నాకు కొంచెం ఎక్కువ సమయమే పట్టింది.’ అని చెప్పుకొచ్చారు.

ఇక ‘ఒకవేళ మీలో ఎవరికైనా కరోనాకు సంబంధించి స్వల్ప లక్షణాలు కనిపించినా సరే వెంటనే పరీక్ష చేయించుకోండి. కొవిడ్‌-19 వైరస్‌తో మీ శరీరం పోరాటం చేయగలదేమో కానీ మీ పక్కనే ఉండే కొంతమంది దాన్ని తట్టుకోలేకపోవచ్చు. ఎప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించండి’ అని నాగబాబు సూచించారు.

click me!