ఇప్పట్లో సినిమాలు చేయను.. షారుఖ్ కామెంట్స్!

Published : Jun 22, 2019, 01:11 PM IST
ఇప్పట్లో సినిమాలు చేయను.. షారుఖ్ కామెంట్స్!

సారాంశం

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కి ఈ మధ్యకాలంలో సరైన హిట్టు సినిమా పడలేదు. 

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కి ఈ మధ్యకాలంలో సరైన హిట్టు సినిమా పడలేదు. వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డ ఈ హీరో 'జీరో' సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో షారుఖ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చేశాడు.

ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. రాకేశ్ శర్మ బయోపిక్ 'సారే జహాసే అచ్చా'లో నటిస్తాడని అనుకున్నారు. కానీ అది కూడా పక్కన పెట్టేశాడు. 'డాన్ 3' సినిమాతో షారుఖ్ తమ ముందుకు వస్తాడని ఫ్యాన్స్ ఆశించగా.. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు ఈ స్టార్ హీరో.

తాను ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదని.. కొద్దిరోజుల వరకూ సినిమాలు చేయనని చెప్పేశాడు. తరచూ సినిమాలు చేయడం, అవి విడుదలైన వెంటనే మరో సినిమాకు రెడీ అవ్వడం.. ఇదే తన జీవితంలో ఇంతకాలం జరిగిందని.. కుటుంబంతో గడిపే టైం దొరకలేదని అన్నారు. ఇప్పుడు తన పిల్లలు కాలేజీ స్టేజ్ కి వచ్చారని.. వారితో టైం స్పెండ్ చేయకపోతే ఎలా అని.. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం స్టోరీలు వింటున్నానని.. ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదువుతున్నానని చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?