ShahRukh Khan : ఇండియా గురించి 20 ఏండ్ల కింద ‘షారుఖ్ ఖాన్’ చెప్పిన మాటలు.. ఆ వీడియోను షేర్ చేస్తున్న నెటిజన్లు

Published : Feb 09, 2022, 02:28 PM ISTUpdated : Feb 09, 2022, 02:29 PM IST
ShahRukh Khan : ఇండియా గురించి 20 ఏండ్ల కింద ‘షారుఖ్ ఖాన్’ చెప్పిన మాటలు.. ఆ వీడియోను షేర్ చేస్తున్న నెటిజన్లు

సారాంశం

బాలీవుడ్ హీరో, సీనియర్ నటుడు షారుఖ్ ఖాన్ దేశభక్తి గురించి చాలా ఆసక్తికర  వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకున్నాని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ  డ్యాన్సర్ షేర్ చేశాడు.    

బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన ‘షారుఖ్ ఖాన్’(Sharukh Khan) తన నటనతో కోట్ల మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు. షారుఖ్ ఖాన్ కు సినిమా అంటే ఎంత ఇష్టమో..  దేశమన్నా అంతే ఇష్టం. సినీ రంగంలో అందనంత ఎత్తుకు ఎదిగిన షారుఖ్.. ఇటీవల తరుచూ వివాదాలకు, విమర్శలకు కూడా గురవుతున్నారు. 

ఇటీవల లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రార్థనలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో అనవసరమైన విమర్శలకు గురి అయ్యాడు. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం చెడు కన్ను నివారించడానికి గాలిలో వీచే ముందు నటుడు దువాలో చేతులు పైకెత్తడం కనిపించింది. భారతదేశ వైవిధ్యానికి నిదర్శనమని చాలా మంది ఈ సంజ్ఞను స్వాగతించినా, ఇద్దరు రాజకీయ నాయకులు నటుడు 'ఉమ్మివేసారు' అని పేర్కొన్నారు.

 

దీంతో అభిమానులు ఇప్పుడు 20 ఏండ్ల కింద షారుఖ్ భారత దేశం గురించిన మాట్లాడిన మాటలకు సంబంధించిన పాత ఇంటర్వ్యూను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. భారత్‌లో అందరం భాగమేనని, భాగమని భావించని వ్యక్తుల అభిప్రాయాలను విన్నప్పుడు లేదా చదివినప్పుడు తనకు బాధగా ఉందని చెప్పారు.

పాఠశాలలో పిల్లలను 'నా దేశం'పై ఒక వ్యాసం రాయమనడం పట్ల స్పందిస్తూ  మనం భారతదేశ పౌరులం కాబట్టి అది తప్పు, భారతం మనకు స్వంతం కాదు. దేశంలో మనం భాగం మాత్రమేనని తెలిపారు. దేశవ్యతిరేకులు లేదా సంఘవిద్రోహులు అని పిలువబడే వారు భారతదేశంలో భాగమని భావించకపోవడం వల్లే అలా తయారయ్యారని పేర్కొన్నాడు. తన కుటుంబం కూడా ఈ దేశం కోసం పోరాడిందన్నారు. తన తండ్రి ‘నేను నీకు ఇచ్చిన స్వేచ్ఛను, దేశానికి కూడా ఇవ్వాలి’ అంటూ చెప్పాడని కూడా గుర్తు చేశాడు.  

ఈ వీడియోను మొదట కొరియోగ్రాఫర్-డ్యాన్సర్ రాఘవ్ జుయల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోను నెటిజన్లు అందరూ షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో షారుఖ్ మాటలు విన్న చాలా మంది అభిమానులు అతనిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియో పట్ల నటి కవితా కౌశిక్ కూడా హార్ట్ ఎమోజీతో షారుఖ్ కు మద్దతు తెలిపింది.  బడే అచ్ఛే లాగ్తే హై నటుడు నకుల్ మెహతా కూడా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం