
హీరోయిన్ గా.. సెకండ్ హీరోయిన్ గా.. టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న స్టార్ నివేదా పేతురాజ్. హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేసే నివేద..ఫస్ట్ టైమ్ వెబ్ సిరీస్ చేసింది. త్వరలో ఆహాలో ఈ వెబ్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో చందు మొండేటి దర్శకుడిగా తెరకెక్కిన వెబ్ సిరీస్ బ్లడీ మేరి. ఈ వెబ్ మూవీ త్వరలో ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు టీమ్.
సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ ఒరిజిల్ ‘బ్లడీ మేరి’ ప్రీమియర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతోనే నివేదా పేతురాజ్ తెలుగు ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ దర్శకుడు చందు మొండేటి డిజిటల్ ఫ్టాట్ ఫామ్ లో తెరకెక్కించిన తొలి ఒరిజినల్ కూడా ఇదే. ఈ వెబ్ ఒరిజినల్ నుంచి నివేదా పేతురాజ్ పాత్రను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు టీమ్.
ఈ మూవీలో నివేదా ఫస్ట్ లుక్ భయపెట్టేలా ఇన్‌టెన్స్‌తో ఉంది. ఇఫ్ యువార్ బ్యాడ్, షి ఈజ్ బ్లడీ బ్యాడ్’ అనేది ట్యాగ్ లైన్. వైకల్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ తన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనగలిగే అమ్మాయిగా ఇందులో నివేదా నటించారు. ఆమెను ప్రేమించిన వారి కోసం ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనగలిగే అమ్మాయిగా మేరి పాత్ర కనిపిస్తుంది.
నివేదాతో పాటు కిరిటీ దామరాజు, రాజ్ కుమార్ కసిరెడ్డి, బ్రహ్మాజీ, అజయ్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ వెబ్ మూవీని నిర్మించారు కార్తికేయ వంటి థ్రిల్లర్ జోనర్‌తో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు చందు మొండేటి ఈ మూవీని డైరెక్టర్ చేశారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్. కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతాన్ని అందించారు. త్వరలోనే బ్లడీ మేరి ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.