నా భార్యతో గొడవపడితే.. 15 రోజులు మాట్లాడను.. హీరో కామెంట్స్!

By AN TeluguFirst Published 17, Jun 2019, 2:42 PM IST
Highlights

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తన భార్య మీరా రాజ్ పుత్ తో గొడవపడితే పదిహేను రోజుల పాటు ఆమెతో మాట్లాడనని చెబుతున్నారు. 

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తన భార్య మీరా రాజ్ పుత్ తో గొడవపడితే పదిహేను రోజుల పాటు ఆమెతో మాట్లాడనని చెబుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి నేహా ధూపియా వ్యాఖ్యాతగా వ్యవహరించే ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు షాహిద్ కపూర్.

ఈ సందర్భంగా తనకు ఎదురైన కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పాడు. ఈ క్రమంలో తన భార్యతో గొడవపడే విషయాన్ని ప్రస్తావిస్తూ.. 'భార్యాభర్తలకు మధ్య గొడవలు రావడం సహజం. అలా రావడం కూడా మంచిదే.. ఒకరితో ఒకరు విభేదించుకోవడం.. సమస్యలను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం.

దాని వాళ్ళ ఒకరి గురించి మరొకరికి పూర్తిగా అర్ధమవుతుందని' అన్నారు. తను కూడా భార్య మీరాతో గొడవపడుతుంటానని చెప్పాడు.రెండు, మూడు నెలలకొకసారి ఇద్దరం గొడవ పడుతుంటామని, అలా గొడవపడినప్పుడు పదిహేను రోజుల పాటు మేం మాట్లాడుకోమని చెప్పారు. ఆ తరువాత ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోవడం జరుగుతుందని, ఆ తరువాత అంతా నార్మల్ అయిపోతుందని అన్నారు.

ప్రస్తుతం షాహిద్ కపూర్ హీరోగా 'కబీర్ సింగ్' సినిమా రూపొందుతోంది. మరికొద్దిరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమాకు రీమేక్ గా 'కబీర్ సింగ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  

Last Updated 17, Jun 2019, 2:42 PM IST