మీరు లెజెండ్ సర్.. మోహన్ బాబుపై స్టార్ హీరో కామెంట్స్!

Published : Jun 17, 2019, 02:32 PM IST
మీరు లెజెండ్ సర్.. మోహన్ బాబుపై స్టార్ హీరో కామెంట్స్!

సారాంశం

తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్య ఇటీవల ఎన్.జి.కె చిత్రంలో నటించాడు. ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం సూర్య కెవి ఆనంద్ దర్శకత్వంలో 'కాప్పాన్' చిత్రంలో నటిస్తున్నాడు. 

తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ సొంతం చేసుకున్న హీరో సూర్య ఇటీవల ఎన్.జి.కె చిత్రంలో నటించాడు. ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం సూర్య కెవి ఆనంద్ దర్శకత్వంలో 'కాప్పాన్' చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శత్వంలో కూడా ఓ చిత్రాన్ని సూర్య ఓకే చేశాడు. 'సురారై పొట్టూర్' అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

ఈ చిత్రంలోప్ సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత మోహన్ బాబు నటిస్తున్న తమిళ చిత్రం ఇది. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. మోహన్ బాబుతో కలసి నటించడం గొప్ప అనుభూతి అని సూర్య ట్వీట్ చేస్తూ ప్రశంసలు కురిపించాడు. మోహన్ బాబు సర్ తో కలసి నటించడం చాలా సంతోషాన్నిస్తోంది. మోహన్ బాబు గారు క్రమశిక్షణ కలిగిన లెజెండ్. ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు అని సూర్య ట్వీట్ చేశాడు. 

సూర్య ట్వీట్ కు మోహన్ బాబు స్పందించారు. నా గురించి చక్కటి మాటలు మాట్లాడినందుకు థాంక్స్. నువ్వు ఈ తరం స్టార్ హీరోవి. అయినా కూడా నీ డెడికేషన్, మంచి స్వభావం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తదుపరి షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నాడు అంటూ మోహన్ బాబు సూర్య ట్వీట్ కు ప్రతిస్పందించారు. 

 

PREV
click me!

Recommended Stories

మాజీ భార్య, గర్ల్ ఫ్రెండ్ తో కలిసి హృతిక్ రోషన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రిచ్ గా క్రూజ్ షిప్ లో పార్టీ
అఖండ 2 తర్వాత మరో సినిమా రిలీజ్ కి రెడీ.. క్రేజీ హీరోయిన్ గ్లామరస్ పిక్స్ వైరల్