లిప్ లాక్ లపై ప్రశ్నలు.. మండిపడ్డ హీరో!

Published : May 16, 2019, 03:54 PM IST
లిప్ లాక్ లపై ప్రశ్నలు.. మండిపడ్డ హీరో!

సారాంశం

బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ముంబైకి చెందిన ఓ విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ముంబైకి చెందిన ఓ విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షాహిద్ హీరోగా నటించిన 'కబీర్ సింగ్' సినిమా ట్రైలర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.

అయితే ట్రైలర్ లాంచ్ వేడుకలో ఓ విలేకరి కియారాను ప్రశ్నిస్తూ.. ''మీరు సినిమాలో ఎన్ని ముద్దులు పెట్టారు..?'' అని అడిగాడు. దానికి ఆమె కౌంట్ చేయలేదని చెప్పింది. ఆ వెంటనే.. ''ముద్దు సన్నివేశాల్లో నటించినప్పుడు మీకేం అనిపించలేదా.?'' మరో ప్రశ్న సంధించాడు.

దానికి ఆమె అసౌకర్యంగా ఫీల్ అయి సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకున్నారు. అయితే వదిలిపెట్టని విలేకరి అందరి ముందు పదే పదే అదే ప్రశ్న అడిగి విసిగించాడు. దాంతో పక్కనే ఉన్న షాహిద్ మైక్ అందుకొని.. ''మీ జీవితంలో గర్ల్ ఫ్రెండ్ లేదా ఏంటి..? ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశాలు చూడాలనుకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించాల్సిందే.. అయితే ఈ సీన్ ఒక్కసాని కోసమే డబ్బు చెల్లించాలని నేను చెప్పడం లేదు.. ముద్దు సన్నివేశాల కోసం మాత్రమే ఎందుకు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు'' అంటూ క్లాస్ పీకాడు.

దీంతో ఆ విలేకరి ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయాడు. తెలుగులో విజయం అందుకున్న 'అర్జున్ రెడ్డి' సినిమాకు 'కబీర్ సింగ్' రీమేక్ గా రాబోతుంది. సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్
Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన