షారుఖ్ ఖాన్ కు బెదిరింపులు, వై కేటగిరి భద్రత కలిపించిన ప్రభుత్వం, బాద్ షా ను బెదిరించింది ఎవరు...?

By Mahesh Jujjuri  |  First Published Oct 10, 2023, 1:00 PM IST

బాలీవుడ్ బాద్ షా.. స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కు ప్రభుత్వం భద్రత కలిపించింది. ఆయనకు వై కేటగిరి భద్రతను అందించింది. బాలీవుడ్ కింగ్ కు బెదిరింపు కాల్స్ వస్తుండటంతో.. బద్రత పెంచినట్టు తెలుస్తోంది.
 


బాలీవుడ్ బాద్ షా.. స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కు ప్రభుత్వం భద్రత కలిపించింది. ఆయనకు వై కేటగిరి భద్రతను అందించింది. బాలీవుడ్ కింగ్ కు బెదిరింపు కాల్స్ వస్తుండటంతో.. బద్రత పెంచినట్టు తెలుస్తోంది.
 
రీ ఎంట్రీ తో దుమ్ము రేపుతున్నాడు బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్. చాలా కాలం గ్యాప్ తరువాత షారుఖ్ చేసిన రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిచిచాయి. కంప్లీట్ గా పడిపోయిన బాలీవుడ్ ను తన రెండుసినిమాలతో నిలబెట్టి ఊపిరి పోశాడు బాద్ షా. ముందు పటాన్. ఆ తరువాత జవాన్ ఈ రెండు సినిమాలు 1000 కోట్ల కలెక్షన్ మార్క్ ను దాటి దూసుకుపోయాయి. దాంతో బాలీవుడ్ కు భగవంతుడిగా మారిపోయాడు షారుఖ్ ఖాన్. ఈక్రమంలో ఆయనకు ఈమధ్య కొన్నిబెదిరింపులు కూడావస్తున్నట్టు తెలుస్తోంది. అది కూడా మాఫియా నుంచి 

ఇప్పటికే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ.. మాఫియా లీడర్లు డైరెక్ట్ గానే బెదిరింపులకు దిగుతున్నారు. అసలు 90స్ లో  బాలీవుడ్‌ ఇండస్ట్రీని అండర్‌ వరల్డ్‌ మాఫియా శాసించే పరిస్థితులు ఉండేవి. స్టార్లను బెదిరించి కూడా డబ్బులు వసూళ్ళు చేశారట అప్పట్లో..అంతే కాదు ముంబయ్ అంతటా మాఫియా డాన్‌లు చెలరేగిపోయేవారు. మళ్లీ ఆరోజులు వస్తున్నాయోమో అన్న అనుమానం కలుగుతోంది. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో  మాఫియా కదలికలు కనిపించడం ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే  సల్మాన్‌ఖాన్‌ పరిస్థితి చూస్తూనే ఉన్నాం. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి బెదిరింపు డైరెక్ట్ గానే ఇస్తుండటంతో.. సల్మాన్ కు  ప్రభుత్వం వై ప్లస్‌ భద్రతను సమకూర్చింది.

Latest Videos

తాజాగా బాలీవుడ్‌ బాద్షా షారుఖ్‌ఖాన్‌కు సైతం ముంబయి మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా వై ప్లస్‌ కేటగిరీ భద్రతను కేటాయిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేటగిరిలో ఆరుగురు సాయుధ సిబ్బంది నిరంతరం షారుఖ్‌ఖాన్‌ భద్రతను పర్యవేక్షిస్తుంటారు. ఈ ఏడాది పఠాన్‌, జవాన్‌ చిత్రాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు షారుఖ్‌. ఈ నేపథ్యంలో అండర్‌ వరల్డ్‌ మాఫియా నుంచి తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని షారుఖ్‌ఖాన్‌ పోలీస్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
 

click me!