
రీ ఎంట్రీలో జోరు చూపిస్తున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan). జీరో సినిమా డిజాస్టర్ అయిన తరువాత నాలుగైదేళ్లు సినిమాలకుగ్యాప్ ఇచ్చాడు షారుఖ్. ఈ గ్యాప్ లో.. షారుఖ్ చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇక ఈమధ్య పటాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షారుఖ్.. ప్లప్ ల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్ కు ఊపిరులూదారు. ఈక్రమంలో ఆయన తాజాగా జవాన్ సినిమాతో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు. ఈసినిమాతో ఈసారి సౌత్ ను టార్గెట్ చేశారు షారుఖ్.
ఇక రీసెంట్ గా షారుఖ్(Shah Rukh Khan) ఖాన్ జమ్ములోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఆలయానికి చేరుకున్న ఆయన అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిసింది. ఆలయ సందర్శనం సందర్భంగా షారుఖ్‌ఖాన్ ఎక్కడా మీడియా కంటబడకుండా జాగ్రత్త పడ్డారు. తన అనుచరులతో కలిసి ఆలయ ప్రాంగణంలో షారుఖ్‌ఖాన్ నడిచి వెళ్లున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో అంతా ఆశ్చర్యం వ్యాక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. జవాన్ సినిమా కోసమే ఆయన పూజలు చేశారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan)తాజా చిత్రం జవాన్ సెప్టెంబర్ 7న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఆయన వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు. గత ఏడాది కాలంలో షారుఖ్‌ఖాన్ ఈ ఆలయాన్ని సందర్శించడం ఇది రెండోసారని తెలుస్తోంది. ఇక కుర్రకారును మించి హ్యాండ్సమ్ నెస్ తో.. దూసుకుపోతున్నాడు షారుఖ్. 60కి చాలా దగ్గరలో ఉన్న స్టార్ హీరో.. సిక్స్ ప్యాక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఆనంద్ మహేంద్రనే షారుఖ్ ఖాన్ ఏం తింటున్నాడు.. యంగ్ హీరోలా మెరిసిపోతున్నాడు అని అన్నారంటే ఆయన డెడికేషన్ అర్ధం అవుతోంది.