నా గదిని గర్ల్స్ హాస్టల్ చేశారు.. వర్మ కామెంట్స్!

Published : May 28, 2019, 04:55 PM IST
నా గదిని గర్ల్స్ హాస్టల్ చేశారు.. వర్మ కామెంట్స్!

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా విజయవాడకు వెళ్లారు. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా విజయవాడకు వెళ్లారు. తను చదువుకున్న సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ని సందర్శించిన ఆయన తను రెండేళ్ల పాటు ఉన్న రూమ్ చూడడానికి వెళ్లాడు. అయితే ఇప్పుడు ఆ గది గర్ల్స్ హాస్టల్ అయిపోయిందని తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. 

ఇదిగో ఈ లవ్ లీ గర్ల్స్ ఇప్పుడు గదిలో రూమ్మేట్స్ గా ఉంటున్నారని వారితో దిగిన ఫోటోని షేర్ చేశారు. తను నిలుచున్న వెనకే శ్రీదేవి ఫోటో ఒకటి ఉండేదని, దాన్ని తనే అతికించినట్లు గుర్తుచేసుకున్నారు.

ఇది ఇలా ఉండగా.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వర్మ తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వర్మ.. ఎన్టీఆర్ ఆశీస్సులతో తన పంతం గెలిచిందని అన్నారు.

వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఏపీలో మినహా అన్ని ప్రాంతాల్లో విడుదలైంది. ఎన్నికల నేపధ్యంలో ఏపీలో సినిమా విడుదల కానివ్వలేదు. ఫైనల్ గా మే 31న ఈ సినిమాను ఏపీలో విడుదల చేయనున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Mysaa Glimpse Review: అడవిలో గర్జించిన రష్మిక మందన్న.. `మైసా` మూవీ ఫస్ట్ గ్లింప్స్ జస్ట్ గూస్‌ బమ్స్
కాంతార 1 రికార్డుకు గండి కొట్టిన ధూరందర్.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ?