స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ కాస్టలీ గిప్ట్

Published : Jul 15, 2024, 06:49 AM IST
స్టార్‌ హీరోలకు అనంత్‌ అంబానీ కాస్టలీ గిప్ట్

సారాంశం

సుమారు రూ.5 వేల కోట్ల ఖర్చుతో జరిగిన ఈ పెళ్లి వేడుకకు వచ్చిన వారికి అదే స్దాయిలో గిప్ట్ లు కూడా అందచేసారు.   


 ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఫార్మాస్యూటికల్ దిగ్గజాలు వీరేన్, శైలా మర్చంట్‌ల కుమార్తె, తన చిన్ననాటి స్నేహితురాలైన రాధికా మర్చంట్ మెడలో అనంత్ అంబానీ  తాళి కట్టారు. ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. సుమారు రూ.5 వేల కోట్ల ఖర్చుతో జరిగిన ఈ పెళ్లి వేడుకకు వచ్చిన వారికి అదే స్దాయిలో గిప్ట్ లు కూడా అందచేసారు. 

ఇక తన వివాహానికి హాజరైన తన స్నేహితులు, ఆత్మీయులకు అనంత్‌ అంబానీ అత్యంత ఖరీదైన వాచీలను కానుకగా అందజేసినట్లు తెలుస్తోంది. అడెమార్స్‌ పిగ్యుట్‌ బ్రాండ్‌కు చెందిన ఈ వాచీ ధర సుమారు కోటిన్నర నుంచి రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. అతిథుల కోసం అంబానీ కుటుంబం వీటిని ప్రత్యేకంగా సిద్ధం చేయించినట్లు సమాచారం. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌ వంటి తారలు ఈ వాచీలతో ఫొటోలకు పోజులిచ్చారు.

ఇక బారాత్ ఊరేగింపులో కేవలం సంప్రదాయ ఆచారాలకే పరిమితం కాలేదు. పలువురు సెలబ్రిటీలు డ్యాన్స్ చేశారు. అమెరికా నటుడు, రాపర్ జాన్ సెనా, సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, రణవీర్ సింగ్‌తో పాటు పెళ్లి కొడుకు అనంత్ అంబానీ కూడా డ్యాన్స్ వేశారు. ఇక కింగ్ షారుఖ్ ఖాన్ నీతా అంబానీతో కలిసి చేసిన డ్యాన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు