మీరు లేకుంటే నేను జీరో.. కల్కి ఘనవిజయంపై ప్రభాస్ ఫస్ట్ రియాక్షన్, వెరీ ఎమోషనల్

Published : Jul 14, 2024, 09:01 PM ISTUpdated : Jul 14, 2024, 09:02 PM IST
మీరు లేకుంటే నేను జీరో.. కల్కి ఘనవిజయంపై ప్రభాస్ ఫస్ట్ రియాక్షన్, వెరీ ఎమోషనల్

సారాంశం

ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేదు అన్నట్లుగా దూసుకుపోతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ లో మరో 1000 కోట్ల మార్క్ అందుకున్న చిత్రంగా కల్కి నిలిచింది. 

ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేదు అన్నట్లుగా దూసుకుపోతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ లో మరో 1000 కోట్ల మార్క్ అందుకున్న చిత్రంగా కల్కి నిలిచింది. ఇటీవల విడుదలైన భారతీయుడు 2 చిత్రానికి ఆశించిన స్పందన రావడం లేదు. దీనితో కల్కికి బాక్సాఫీస్ వద్ద ఇక తిరుగులేకుండా పోయింది. 

కల్కి ఇంతటి ఘన విజయం తర్వాత ప్రభాస్ తొలిసారి స్పందించాడు. అభిమానులకు, కల్కి చిత్ర యూనిట్ కి కృతజ్ఞతలు చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. ప్రభాస్ మాట్లాడుతూ.. నా అభిమానులందరికి థాంక్యూ సో మచ్. నాకు ఇంత పెద్ద హిట్ అందించారు. మీరు లేకుంటే నేను జీరో అంటూ ప్రభాస్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 

డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి థ్యాంక్స్. ఈ చిత్రం కోసం ఐదేళ్లు హార్డ్ వర్క్ చేశారు. ఇంత భారీ చిత్రం నిర్మించాలంటే గట్స్ ఉన్న నిర్మాతలు కావాలి. అలంటి నిర్మాత అశ్విని దత్ గారికి వారి పిల్లలు ప్రియాంక, స్వప్న లకి థ్యాంక్స్. ఇంత భారీ బడ్జెట్ రిస్క్ అని చెప్పినా వెనకడుగు వేయలేదు. ఆడియన్స్ కి మనం మంచి క్వాలిటీ ఇవ్వాలి అని అన్నారు. 

 

ఈ నిర్మాతలకి, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి మరోవిషయంలో కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇండియన్ సినిమా లెజెండ్స్ అమితాబ్ సర్, కమల్ సర్ లతో కలసి నటించే అవకాశం ఇచ్చారు. అందమైన దీపికా పదుకొనె కి కూడా థ్యాంక్స్. కల్కి పార్ట్ 2 ఇంకా భారీగా ఉండబోతోంది అని ప్రభాస్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మాజీ భార్య, గర్ల్ ఫ్రెండ్ తో కలిసి హృతిక్ రోషన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రిచ్ గా క్రూజ్ షిప్ లో పార్టీ
అఖండ 2 తర్వాత మరో సినిమా రిలీజ్ కి రెడీ.. క్రేజీ హీరోయిన్ గ్లామరస్ పిక్స్ వైరల్