జీవితం ఎలాంటిదో వివరిస్తున్నారు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. ముఖ్యంగా తన జీవితం గురించి చెపుతూ.. డిఫరెంట్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ ఆయన ఏమంటున్నాడంటే..?
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ డిఫఱెంట్ కామెంట్స్ చేశారు. ఎప్పుడూ లేనిది వేదాంతం మాట్లాడాడు బాద్ షా. జీవితం గురించి వివరిస్తూ.. తన జీవితాన్ని కూడా అందులో కలిపి ఇంకా వివరంగా ఏదో చెప్పబోయాడు. ఇంతకీ ఆయన ఏమంటున్నాడంటే.. జీవితం పీజ్జాలంటిదని. అదేంటి షారుఖ్ ఆమాట ఎలాఅన్నారు ఎందుకు అన్నారు. షారుక్ ఖాన్ బాలీవుడ్ లో చాలా ఇబ్బందులు పడ్డారు. సీనియల్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. బాలీవుడ్ ను ఏలే స్థాయికి ఎదిగాడు. వరుస సినిమాలు.. కోట్లలో రెమ్యునరేషన్.. బిజినెస్ లు...ఇన్వెస్ట్ మెంట్లు.. వేల కోట్ల సంపద సృష్టించి చాలా గొప్పస్థాయికి ఎదిగాడు.
అంతే కాదు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన హీరోలలో 4వ స్థానంలో షారుఖ్ ఖాన్ ఉన్నాడు ఆ స్థాయిలో ఉన్నాడంటే ఎంత కసితో సంపాదించి ఉండాలి.. ఎంత పేరు వచ్చి ఉండాలి. అటువంటి షారుఖ్ ఖాన్.. కొన్నాళ్ళ క్రితం వరకూ వరుస ఫెయిల్యూర్స్ తో బాధపడ్డాడు. దాదాపు 5 ఏళ్లు నిరాశతో వరుసగా దెబ్బ మీద దెబ్బతగిలి ఇబ్బందిపడ్డాడు. అదే టైమ్ లో సినిమాలు లేవు, షారుఖ్ తనయుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం.. ఇలా ఎన్నోఇబ్బందులు పడి.. మళ్లీ రీసెంట్ గా.. అంటే లాస్ట్ ఇయర్ అన్నింటి నుంచి బయటపడి కోలుకున్నాడు.
ఇక షారుఖ్ తో పాటు బాలీవుడ్ కూడా పడిపోయింది. టాలీవుడ్ మకుటం లేకుండా సినిమా రాజ్యాన్ని ఏలుతుండగా.. బాద్ షా ఎంటర్ అయ్యాడు రెండు సినిమాలు పఠాన్, జవాన్ రెండు.. ఒక్కో సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్ మార్క్ ను దాటించాడు.. ముచ్చటగామూడో సినిమా కూడా దాదాపు 5 కోట్లకుపైగాకలెక్ట్ చేసింది. షారుఖ్ మళ్లీ పైకి లేచాడు.. బాలీవుడ్ ను కూడా నిలబెట్టాటు.ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో షారుఖ్ మాట్లాడుతూ లైఫ్ అండ్ కెరీర్ గురించి మాట్లాడాడు.
ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల తర్వాత నేను ప్రేక్షకుల ముందుకొచ్చాను. ఆ విరామం నాకు చాఆల పాఠాలు నేర్పింది అని చెప్పాడు షారుఖ్. ఈ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉండకుండా.. వంట గదికి వెళ్లి పీజ్జాలు చేయడం నేర్చుకున్నాను అని చెప్పాడు. పర్‌ఫెక్ట్ పిజ్జా తయారు కావడానికి ఎంత ప్రాసెస్ ఉంటుందో జీవితం కూడా అంతే అని తెలుసుకున్నాను అని జీవితానికి, పీజ్జాకు లింక్ పెట్టి లైఫ్ లెసెన్ చెప్పాడు షారుఖ్.
ఆ సమయంలో తిరిగి సినిమాలు చేయమని తన ఫ్యామిలీ ప్రోత్సహించిందని, అప్పుడే ‘పఠాన్’, ‘జవాన్’ కథలు ఓకే చేశాను అని చెప్పాడు షారుఖ్. ఇండస్ట్రీలో శుక్ర, శని, ఆదివారాలు ముఖ్యం అంటుంటారని, కానీ తాను సోమవారాన్ని కూడా ముఖ్యమైన రోజుగానే చూస్తాను అని చెప్పారు.అలా మరో 35 ఏళ్లు నటించడానికీ తాను సిద్ధా ఉన్నట్టు చెప్పారు షారుఖ్ ఖాన్. అంతే కాదు తనకు అన్ని భాషల్లో నటించాలని ఉందన్నారు. ఇంగ్లీష్ నుంచి మంచి కథ రాలేదని.. వస్తే ఇప్పుటికిప్పుడు సినిమా చేయడానికి తాను రెడీగా ఉన్నానన్నారు షారు్ఖ్ ఖాన్.