యాంకర్ తో ప్రేమలో పడ్డ విశ్వక్ సేన్ ..? పబ్లిక్ గా ఆ మాట అనేశాడుగా....?

By Mahesh Jujjuri  |  First Published Feb 15, 2024, 5:19 PM IST

కాంట్రవర్సీలకు, డిఫరెంట్ కామెంట్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం విశ్వక్ రెండు ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతుండగా.. తాజాగా అతను ఓ యాంకర్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 


 మాస్ దా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అందులో ఒకటి  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కాగా మరొకటి గామి. ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మరో స్టార్ హీరోయిన్ అంజలి లీడ్ రోల్ లో కనిపించబోతోంది. ఇక  ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి డెల్టా నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ. ఇప్పటికే ఇద్దరు  హీరోయిన్లు సందడి చేయబోతున్నారు. 

ఇక ఆ సినిమాతో పాటు విశ్వక్ గామి సినిమా కూడా చేస్తున్నాడు. గామి మార్చి 8న రిలీజ్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈసినిమాకు  విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది.  ఇక ఈమూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ కు పదును పెట్టారు మూవీ టీమ్. విశ్వక్ సేన్ రకరకాల ఈవెంట్ల ద్వారా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసే పని పెట్టుకున్నాడు. అందులో భాగంగా గామీ ప్రమోషన్ ఈవెంట్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

Latest Videos

గామీ ప్రమోషన్ ప్రోగోరామ్ జరగ్గా.. ఆయన ఓ యాంకర్ పై క్రేజీ కామెంట్స్ చేశాడు. తన లేటెస్ట్ మూవీ గామి ప్రొమోషన్స్ లో విశ్వక్ సేన్ పాల్గొంటున్నాడు. గామి చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ ఈవెంట్ కి బిగ్ బాస్ ఫేమ్ స్రవంతి చొక్కారపు యాంకర్ గా వ్యవహరించారు. స్రవంతి గ్లామర్ కి ఫ్లాట్ అయిన విశ్వక్ సేన్… ఇక మైక్ తీసుకున్న విశ్వక్ సేన్… ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు.  ఈ మధ్య మీరు హీరోయిన్స్ కంటే మంచి చీరలు కడుతున్నారు.. అని అన్నాడు. దాంతో స్రవంతి మురిసిపోయింది. థాంక్యూ అంటూ కృతజ్ఞతలు తెలిపింది. 

స్రవంతి చొక్కారపు బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాలొన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్షన్ కాగా… హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయ్యింది. బిగ్ బాస్ తో తన సత్తా చూపించిన స్రవంతి.. ఫైనల్ వరకూ వెళ్ళలేక పోయింది. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తరువాత ఆమెకు కాస్త అవకాశాలు పెరిగాయనే చెప్పాలి. 

ఇక విశ్వక్ సేన్ నటిస్తున్న మరో సినిమా  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా రిలీజ్ కు రెడీ అవ్వగా.. ఈయంగ్ హీరోన .. తన  10వ చిత్రం కూడా ప్రకటించారు. ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ మార్క్ ఉండేలా చూసుకుంటున్నాడు విశ్వక్. అదే టైమ్ లో కాంట్రవర్సీలతో ఫేమస్ అవుతున్నారు. ఆయన చాలా వివాదాల్లో చిక్కుకోగా.. చాలా వరకూ అతనికే సపోర్ట్ దొరికింది. 

click me!