చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ కన్నడ నటుడు మృతి!

Published : Jan 29, 2023, 04:53 PM ISTUpdated : Jan 29, 2023, 05:04 PM IST
చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ కన్నడ నటుడు మృతి!

సారాంశం

సినీ ఇండస్ట్రీలో వరుస విషాద ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రముఖ హాస్య నటుడు తాజాగా కన్నుమూశారు. ఈ సందర్భంగా ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.   

గతేడాది చిత్ర పరిశ్రమలోని దిగ్గజ నటులు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సంవత్సర ప్రారంభంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. రీసెంట్ గా సీనియర్ నటి జమున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మరణవార్తను ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్నారు. ఈలోగా మరో విషాద ఘటన  జరిగింది. ప్రముఖ కన్నడ నటుడు తాజాగా కన్నుమూశారు. దీంతో కన్నడ చిత్రం పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. 

సాండల్ వుడ్ కు చెందిన మన్ దీప్ రాయ్ (Mandeep Roy) తాజాగా గుండెపోటుతో మరణించారు. 74 ఏండ్ల వయస్సులో ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్ప్రతిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో హార్ట్ ఎటాక్ తో ప్రాణాలొదినట్టు కుటుంబ సభ్యుల నుంచి సమాచారం. మన్ దీప్ రాయ్ మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికన సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

మన్ దీప్ రాయ్ మరణవార్తను తెలుపుతూ కన్నడ దర్శకుడు వెంకట్ భరద్వాజ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఆయన బెంగాలీకీ చెందిన వారని తెలిపారు. కానీ కన్నడ చిత్రపరిశ్రలోనే నటించి, అక్కడే స్థిరపడ్డారని అన్నారు. దీంతో కన్నడ ప్రజలతో మంచి అనుబంధం ఏర్పడిందని పేర్కొన్నారు. ‘పుష్ఫక విమాన’లో ఆయన నటనను ఆడియెన్స్ ఎప్పటికీ మరిచిపోలేరని  అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. పుష్పక విమానంతో పాటు.. దేవర ఆట, మించిన ఓట, నాగరహావు, ఆప్త రక్షక, అమ్రుత ధారే, కురిగాలు సార్ కురిపాలు వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Nari Nari Naduma Murari Review: `నారీ నారీ నడుమ మురారి` మూవీ రివ్యూ.. శర్వానంద్‌ కి హిట్‌ పడిందా?
AALoki : అల్లు అర్జున్ దూకుడు, లోకేష్ కనగరాజ్ తో 23వ సినిమా ఫిక్స్, అఫీషియల్ అనౌన్స్ మెంట్