‘జవాన్’ఫస్ట్ డే కలెక్షన్స్, ‘పఠాన్ ’ని ఈజీగా దాటేసిందిగా

షారుక్‌ ఖాన్ కెరీర్‌లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం పఠాన్. ప్రస్తుతం జవాన్‌ కూడా రూ. 1000 కోట్లను సులభంగా దాటడం ఖాయం అని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Google News Follow Us


బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shahrukh khan)తాజా చిత్రం జవాన్ ...గురు వారం రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.  బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్  దుమ్ములేపుతున్నాయి. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో థియేటర్స్ దగ్గర షారుఖ్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. రీసెంట్ గా పఠాన్(Pataan) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కింగ్ ఖాన్.. జవాన్ సినిమాతో అంతకుమించి  అన్నట్లు దూసుకుపోతున్నాడు.  

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...తొలి రోజు 75 కోట్లు వచ్చాయి.  హిందీ బెల్ట్ నుంచి 65 కోట్లు రాగా, తెలుగు,తమిళం నుంచి పదికోట్లు దాకా వసూలు చేసినట్లు చెప్తున్నారు. బాలీవుడ్ లో ఈ ఫీట్ అందుకున్న ఏకైక హీరోగా షారుఖ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంతకు ముందు ఆ రికార్డ్ షారుఖ్ నటించిన గత చిత్రం పఠాన్ పేరుమీద ఉంది. ఇప్పుడు జవాన్ సినిమాతో తన రికార్డ్ తానే తిరగరాయటం జరిగింది.

పఠాన్ సినిమా తొలి రోజు 57 కోట్లు వచ్చాయి. అయితే రెండో రోజు 70 కోట్లుకు వెళ్లింది. అల్లిమేట్ కు ఫైనల్ రన్ పూర్తయ్యే సరికి  543 కోట్లు వచ్చాయి. దాంతో ఇప్పుడు జవాన్ కూడా అలాంటి ఫీటే చేయబోతోందంటున్నారు. దాదాపు వెయ్యి కోట్ల వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నారు.
 
దానికి తోడు ఈ మధ్యకాలంలో  ఓ హిందీ  సినిమా రిలీజ్ కోసం ఇంతలా  సౌత్ ఆడియన్స్ ఎదురుచూడ్డం ఇదేనేమో. షారూఖ్ గత చిత్రం పఠాన్ ఇక్కడ కూడా వర్కవుట్ కావటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. దానికి తోడు  తమిళ డైరక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా రూపొందటం, నయనతార హీరోయిన్ కావటం, రీసెంట్ గా జైలర్ తో దుమ్ము రేపిన  అనిరుధ్ ఈ సినిమాకు పనిచేయటం, విజయ్ సేతుపతి విలన్ గా చేయటం, ఇలా సౌత్ ఇండియన్ ఇంట్రిగ్రెంట్స్ తో నింపేయటంతో మనకు ఇక్కడా క్రేజ్ క్రియేట్ అయ్యింది.