
సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ‘జైలర్ 2’ గురించి ఒక పెద్ద అప్‌డేట్ బయటికొచ్చింది. ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్ కోసం బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో మేకర్స్ మాట్లాడుతున్నారని టాక్. నిజానికి ఈ రోల్ ముందు షారుఖ్ ఖాన్‌కు ఆఫర్ చేశారు. కానీ, తన 'కింగ్' సినిమా షూటింగ్ షెడ్యూల్ వల్ల ఆయన ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఇప్పుడు ఈ వార్తతో ‘జైలర్ 2’పై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా, 2026లో రాబోయే అతిపెద్ద పాన్-ఇండియా చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు.
‘జైలర్ 2’ టీమ్ ఒక స్పెషల్ క్యామియో రోల్ కోసం హృతిక్ రోషన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచార. ముందుగా ఈ పాత్రను షారుఖ్ ఖాన్‌కు ఆఫర్ చేయగా, ‘కింగ్’ సినిమా కమిట్‌మెంట్స్ వల్ల ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం. అయితే, దీనిపై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే ఇందులో మరో క్యామియో కోసం పవన్‌ని కూడా సంప్రదించారట. కానీ ఆయన ఆసక్తి చూపించలేదని టాక్. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
‘జైలర్ 2’లో రజనీకాంత్ మరోసారి ముత్తువేల్ పాండియన్ పాత్రలో కనిపించనున్నారు. మొదటి భాగం కథకు కొనసాగింపుగా ఈ సినిమా ఉండబోతోంది. ఈసారి సినిమా స్కేల్ మరింత పెద్దగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాని 2026 సెప్టెంబర్ 11న విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రజనీకాంత్‌తో పాటు మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటిస్తారు. అంతేకాదు, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ కూడా తమ పాత పాత్రల్లో మళ్లీ కనిపించనున్నారు. అందుకే ఈ సినిమాను ఒక మెగా మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు.
‘జైలర్ 2’తో పాటు రజినీకాంత్ ‘తలైవర్ 173’ సినిమాతో కూడా వార్తల్లో ఉన్నారు. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. ఇది కాకుండా, రజనీకాంత్-కమల్ హాసన్ కాంబినేషన్‌లో రాబోయే సినిమా గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.