మొదటి సారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్, తిరుమలేశుని సేవలో జవాన్ టీమ్..

Published : Sep 05, 2023, 09:50 AM ISTUpdated : Sep 05, 2023, 10:08 AM IST
మొదటి సారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్, తిరుమలేశుని సేవలో జవాన్ టీమ్..

సారాంశం

మొట్టమొదటి సారి తిరుమల శ్రీవారిని దర్శిచుకున్నాడు బాలీవుడ్ బాద్ షా.. స్టార్ హీరో షారుఖ్ ఖాన్. జవాన్ టీమ్ తో కలిసి తిరుమలేశుని దర్శనం చేసుకున్నారు.   

మొట్టమొదటి సారి తిరుమల శ్రీవారిని దర్శిచుకున్నాడు బాలీవుడ్ బాద్ షా.. స్టార్ హీరో షారుఖ్ ఖాన్. జవాన్ టీమ్ తో కలిసి తిరుమలేశుని దర్శనం చేసుకున్నారు. 

జవాన్ సినిమా కోసం ఎప్పుడు లేనివిధంగా షారుఖ్ ఖాన్ ప్రమోషన్స్ చేస్తున్నాడు. అందరు ఆడియన్స్ ను టార్గెట్ చేయడంతోపాటు.. బాలీవుడ్, సౌత్ ఆడియన్స్ ను టార్గెట్ చేశాడు. అందుకు ప్రమోషన్లు, సోల్ మీడియా చిట్ చాట్ తో పాటు.. ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేస్తున్నాడు. అందులో భాగంగా ఆమధ్య సీక్రేట్ గా జమ్ము కాశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయాన్ని దర్శిచుకున్న షారుఖ్.. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. 

షారుఖ్ ఖాన్ తన కుటుంబంతో పాటు, నయనతార, జవాన్ టీమ్ తో కలిసి నేడు( సెప్టెంబర్ 05) తిరుమల శ్రీవారినిదర్శించుకున్నారు . భార్య గౌరీ ఖాన్‌, కుమార్తె సుహానా ఖాన్, నటి నయనతారతో కలిసి ఆయన సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తొలుత దేవస్థానం అధికారులు షారుఖ్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత షారుఖ్ గర్భాలయంలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆ తరువాత పండితులు షారుఖ్‌కు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. 

 

ఈసారి కూడా పఠాన్ మాదిరిగానే సాలిడ్ హిట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు షారుఖ్ ఖాన్. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో.. నయనతార హీరోయిన్ గా.. జవాన్ సినిమా తెరకెక్కింది. అంతే కాదు.. సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ చేయడంతో పాటు.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈసినిమాలో లీడ్ క్యారెక్టర్ లో నటించారు. ఇక ఈమూవీని ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడం కోసం సన్నాహాలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌