డైనోసార్ ని డైరక్ట్ గా ఎదుర్కోలేక షారూఖ్ ఈ వైల్డ్ డెసిషన్ ?

Google News Follow Us

సారాంశం

  ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్, షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డుంకీ. ఈ రెండు సినిమాల రిలీజ్ లు,రిజల్ట్ ల కోసం  చిత్ర పరిశ్రమ మొత్తం ఎదురుచూస్తుంది.

ప్రభాస్ VS షారుఖ్ ఖాన్ క్లాష్ లో కొత్త మలుపులు చోటు చేసుకుంది.  డిసెంబర్ 22 రెండు సినిమాలు పరస్పరం తలపడబోతాయనుకుంటే  డుంకీ రేస్ నుంచి తప్పుకుంది. అయితే పూర్తిగా కాదు..ఓ రోజు ముందుకు వచ్చింది.  రెండు పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు రిలీజైతే వచ్చే  సమస్యలు  అంచనా వేసుకుని డుంకీ టీమ్ ఓ రోజు ముందు రావటానికి డిసైడ్ అయ్యింది. అంటే డిసెంబర్ 21 న డింకీ రిలీజ్ అవుతుంది. ఇది చాలా తెలివైన డెసిషన్ అంటోంది ట్రేడ్.  ఇలా చేయటం వల్ల కలిసొచ్చేదేమిటంటే...

 #Dunki సినిమాకు దేశం మొత్తం సోలో రిలీజ్ దొరుకుతుంది. మీడియా కూడా ఇదే సినిమా గురించి రోజంతా మాట్లాడే అవకాసం ఉంటుంది. అదే సలార్ సీన్ లో ఉంటే సౌత్ మీడియా మొత్తం సలార్ వైపు టర్న్ అవుతుంది. దాంతో ఖచ్చితంగా డింకీ కు దెబ్బపడుతుంది. 

ఇక ఓవర్ సీస్ లో రెండు సినిమాలకు దేనికదే విడిగా మంచి ఓపినింగ్స్ దొరుకుతాయి. మరుసటి రోజు చూద్దామని ఏ సినిమాని వాయిదా వేసుకోరు. నేషనల్ మల్టిప్లెక్స్ లు సైతం మొదటి రోజు డింకీ తో నిండిపోతాయి. తర్వాత రోజు నుంచే సలార్ తో షేర్ చేసుకుంటాయి. అయితే ఈ వాయిదా విషయమై సలార్ నిర్మాతలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. వాళ్లు డిసెంబర్ 22 కు వస్తారా లేదా డింకీ దారిలోనే 21 వ తేదీకు ప్రీ పోన్ చేసుకుంటారా అనేది వేచి చూడాల్సిన విషయం. 


  
ఇక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన డుంకీ ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. బాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడుగా హిరానీ కి పేరు ఉంది. ఆయన సినిమా అంటే మన సౌత్ ఇండియన్స్  ఆసక్తి చూపుతారు. ఇక సలార్ విషయానికి వస్తే...ప్రభాస్, శృతి హాసన్ జంటగా కెజిఎఫ్ తో స్టార్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. లేస్తూ.. ఎట్టకేలకు డిసెంబర్ 22 న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఈ  ప్రకటనతో .. ఎన్నో సినిమాలు వెనక్కి, ముందుకు వెళ్లి పోయాయి. డైనోసార్ ముందు నిలబడలేము అన్నాయి. కానీ  డుంకీ మాత్రం స్ట్రాంగ్ గా నిలబడింది.

Read more Articles on