స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). విడుదలకు సిద్ధం అవుతుండగా.. చిత్ర యూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తోంది. తాజాగా రెండో పాటను విడుదలకు సిద్ధం చేశారు.
సైంటిఫిక్ యాక్షన్ ఫిల్మ్ ‘యశోద’తో స్టార్ హిట్ సమంత (Samantha) సాలిడ్ హిట్ అందుకుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత లీడ్ రోల్ లో నటించిన చిత్రమిది. గతేడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’తో మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నారు సమంత. భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం రిలీజ్ కు సిద్ధం అవడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తోంది.
ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ట్రైలర్, ఫస్ట్ సింగిల్, అంతకు ముందుకు పోస్టర్లు విడుదలైన ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘మల్లిక’కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా మరో క్రేజీ అప్డేట్ అందించారు. చిత్రం నుంచి Rushivanamlona అనే రెండో పాటను విడుదలకు సిద్ధం చేశారు. ఈ మెలోడీ సాంగ్ ను జనవరి 25న రిలీజ్ చేయబోతున్నట్టు తాజా అనౌన్స్ మెంట్ లో పేర్కొన్నారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లోనూ ఒకేసారి సెకండ్ సింగిల్ ను విడుదల చేయబోతున్నారు.
పురాణాల ఆధారంగా శాకుంతలం, దుష్యంతుడి ప్రేమ కథ నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. టైటిల్ రోల్ లో సమంత నటిస్తోంది. మేయిల్ లీడ్ రోల్ లో దేవ్ మోహన్ అలరించబోతున్నారు. చిత్రానికి గుణశేఖర్ (Gunashekar) దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. అదితి బాలన్ మరో పాత్రలో కనిపించనుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో చిత్రాన్నివిడుదల చేబోతున్నారు. ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేశారు.
చిత్రంలో అదిరిపోయే గ్రాఫిక్ వర్క్ ఉండబోతోంది. వీఎఫ్ఎక్స్ తో పాటు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సంగీతం అందిస్తున్నారు. త్రీడీలోనూ తెరకెక్కబోతుండటం విశేషం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక సమంతో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తుండంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న శాకుంతలం కోసం అభిమానులు ఎదురుచూస్తుున్నారు.
A melody you'd fall in love with!🤍🎶//// from Jan 25th. pic.twitter.com/GFwkyIUv9U
— Sri Venkateswara Creations (@SVC_official)